Thursday, November 21, 2024

Encounter – కాంగ్రెస్ పార్టీకి కౌంట‌ర్ … రేపు స్వేద ప‌త్రం పేరుతో బిఆర్ఎస్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ..

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల‌లో ఆర్థిక‌, విద్యుత్ శాఖ‌పై శ్వేత‌ప‌త్రాల‌ను విడుద‌ల చేసింది.. ఆయా శ్వేత‌ప‌త్రాలు ఆయా శాఖ‌ల ఆర్థిక ప‌రిస్థితి గురించి వివ‌ర‌ణే త‌ప్ప‌… ఎవ‌రికీ వ్య‌తిరేకంగా వాటిని ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌భ‌లో తేల్చి చెప్పారు.. అయితే ఈ రెండు శ్వేత ప‌త్రాలు త‌ప్పులు త‌డ‌క‌గా ఉన్నాయ‌ని, అవాస్త‌వాల‌తో తెలంగాణ ఇమేజ్ ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం డామేజ్ చేస్తున్నదంటూ బిఆర్ఎస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.. గ‌త ప్ర‌భుత్వాన్ని బ‌ద‌న్నాం చేస్తున్న క్ర‌మంలో తెలంగాణ‌కే మ‌చ్చ తెస్తున్నారంటూ స‌భ‌లోనే కెటిఆర్,హారీష్ రావు, జ‌గ‌దీష్ రెడ్డి గ‌ట్టిగానే మాట్లాడారు.. శ్వేత‌ప‌త్రాల‌లోని అంశాలపై హౌజ్ కమిటిని వేయాల‌ని, లేదంటూ న్యాయ విచార‌ణ జ‌ర‌పాల‌నే డిమాండ్ ను సైతం స‌భ ముందుంచారు..

ఈ నేప‌థ్యంలో బిఆర్ఎస్ పార్టీ కీల‌క నిర్ణయం తీసుకుంది.. ప‌దేళ్ల పాల‌న‌పై స్వేద ప‌త్రం పేరుతో రేపు ప‌వ‌న్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నుంది.. దీనికి వేదిక‌గా తెలంగాణ భ‌వ‌న్ ను చేసుకుంది..ఈ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ రేవు ఉద‌యం 11 గంట‌ల‌కు ఇస్తామ‌ని మాజీ మంత్రి,ఆ పార్టీ కార్యానిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.. అలాగే స్వేద ప‌త్రం ప్రాముఖ్య‌తను తెలిపేలా ట్విట్ కూడా ఆయ‌న చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement