Saturday, November 23, 2024

ఎంసెట్‌-2023 ప్రిలిమనరీ కీ విడుదల.. రేపు సాయంత్రం నుంచి అందుబాటులోకి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ఎంసెట్‌ -2023 ఇంజనీరింగ్‌ విభాగం పరీక్ష ప్రిలిమినరీ కీ సమాధాన పత్రం విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి 14 వరకు జవహర్‌లాల్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్‌) ఎంసెట్‌ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రిలిమనరీ కీని యూనివర్సిటీ టీఎస్‌ఎంసెట్‌-2023 పరీక్షల విభాగం కన్వీనర్‌ విడుదల చేశారు. విద్యార్థులు వారి మాస్టర్‌ పత్రాలతోపాటు ప్రిలిమనరీ కీని యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి సోమవారం 8 గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వీనర్‌ పేర్కొన్నారు.

మాస్టర్‌ జవాబుపత్రాలతోపాటు ప్రిలిమనరీ కీ లోని సమాధానాలపై విద్యార్థులు తమ అభ్యంతరాలను ఈ నెల 15 నుంచి 17తేదీ సాయంత్రం 8లోగా వెబ్‌సైట్‌ వేదికగా సమర్పించాలని సూచించారు. విద్యార్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆబ్జెక్షన్స్‌ ఆన్‌ ప్రిలిమనరీ కీ బై ఆప్షన్‌ ఇన్‌ టీఎస్‌ ఎంసెట్‌-2023 ఆప్షన్‌పై క్లిక్‌ చేసి అభ్యంతరాలను సమర్పించాలని వివరించారు. వెబ్‌సైట్‌ నుంచి నిర్దేశించిన మేరకు కాకుండా ఇతర మార్గాల్లో సమర్పించే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితిలో పరిగణనలోనికి తీసుకోబోమని ఎంసెట్‌-2023 కన్వీనర్‌ తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement