Tuesday, November 26, 2024

హెచ్‌పీలోనూ ఉద్యోగులపై వేటు

అమెరికాలోని బడా కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఇప్పటికే అనేక దిగ్గజ ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో మరో ప్రముక కంపెనీ హెచ్‌పీ కూడా చేరింది. గూగుల్‌, అమెజాన్‌, మెటా, సిస్కో, ట్విటర్‌ వంటి సంస్థలు ఒక్కొక్కటి పది వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. 2025 నాటికి 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు హెచ్‌పీ ప్రకటించింది. పర్సనల్‌ కం ప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌ తగ్గడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు రికార్డ్‌ స్థాయిలో అమ్ముడుపోయాయి. కరోనా నుంచి కోలుకున్న

తరువాత పరిస్థితి మారిపోయింది. వీటి కొనుగోళ్లు భారీగా తగ్గాయి. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని హెచ్‌పీ నిర్ణయించింది. ఈ పరిస్థితి 2023లోనూ కొనసాగుతుందని హెచ్‌పీ అంచనా వేస్తోంది. వచ్చే ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనా కంటే తక్కువ లాభాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్‌పీ భావిస్తోంది. ప్రస్తుతం హెచ్‌పీలో 50 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 12 శాతం లేదంటే 4-6 వేల మందిని తగ్గించుకోవాలని భావిస్తోంది.

- Advertisement -

కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు తయారు చేస్తున్న ఇతర కంపెనీలు కూడా ఇదే పరిస్థిని ఎదుర్కొంటున్నాయి. మూడో త్రైమాసికంలో డెల్‌ ప్రకటించిన ఆర్ధిక ఫలితాల్లో కంపెనీ ఆదాయం 6 శాతం క్షిణించింది. ఇంటెల్‌ కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని
భావిస్తున్నట్లు వార్తుల వస్తున్నాయి. ఇంటెల్‌లో ప్రస్తుతం 1.13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో వేల సంఖ్యలోనే ఇంటెల్‌ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.

క్రెడిట్‌ సూయిజ్‌లో 9 వేల మంది…

ఆర్ధిక మాంద్యం భయాల, ఉద్యోగాల కోతలు ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలపై ప్రభావం ఊపే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జ్యూరిచ్‌ కేంద్రంగా పని చేస్తున్న క్రెడిట్‌ సూయిజ్‌ 9 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ 2,700 మంది ఉద్యోగులను తొలగించింది. 2025 నాటికి మరో 9 వేల మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. వ్యయ ని యంత్రణలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. క్రెడిట్‌ సూయిజ్‌ అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో 1.6 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని అంచనా వేసింది. వెల్త్‌మేనేజ్‌మెంట్‌, స్వీస్‌ బ్యాంక్‌ డివిజన్‌లో వినియోగదారుల కార్యకలాపాలు నెమ్మదించాయని, ఈ నేపథ్యంలోనే నష్టాలు అంచనా వేసినట్లు తెలిపింది.

ఉద్యోగులను తొలగించడంతో పాటు, కంపెనీ పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు పేర్కొంది. బ్రిటిష్‌ వెల్త్‌ ప్లాట్‌ఫామ్‌ ఆల్‌ఫండ్స్‌ గ్రూప్‌లో వాటాల విక్రయం వల్ల క్రెడిట్‌ సూయిజ్‌కు నాలుగో త్రైమాసికంలో 75 మిలియన్‌ స్వీస్‌ ప్రాంక్‌ల నష్టం వచ్చిందని తెలిపింది. డిపాజిట్ల మొత్తం, నిర్వహణలోని ఆస్తులు, నికర వడ్డీ ఆదాయం,కమీషన్లు, రుసుములు తగ్గడమే ఇందుకు కారణమని తెలిపింది. దీని వల్ల కంపెనీ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ బోర్డు అసాధారణ సమావేశం బుధవారం నాడు జరిగింది. కంపెనీని పూర్తి స్థాయిలో పునర్‌వ్యవస్థీకరణ, మూలధన నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement