కాంగ్రెస్లో చేరిన నుంచి చెరకు సుధాకర్ నన్ను తిడుతున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. నిన్న ఆడియో టేప్ వైరల్ కావడంపై కోమటి రెడ్డి స్పందించారు. నేను భావోద్వేగంతో చేసిన వాఖ్యలే.. వేరే ఉద్దేశ్యం లేదన్నారు. 33 ఏళ్ల రాజకీయం ఎప్పుడు నా రాజకీయ ప్రత్యర్థుల పై గాని ఎవరి పై కూడా దూషించలేదన్నారు. నా శత్రువులను కూడా దగ్గర తీసే తత్వం నాది.. తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తా అన్నారు. చెరకు సుధాకర్ పై పీడీయాక్ట్ పెడితే.. నేనే కోట్లాడా అని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నేను మాట్లాడిన విషయాలు ఆడియో టేప్ లో కట్ చేశారన్నారు. కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేశారన్నారు. రికార్డు చేస్తున్నారని నాకు కూడా తెలుసు అన్నారు. పార్టీలో చేరిన నుంచి చెరకు సుధాకర్ నన్ను తిడుతున్నారని, ఎందుకు తిడుతున్నారో అని అడగడం జరిగిందన్నారు. నన్ను తిట్టవద్దని చెరకు సుధాకర్ కుమారుడికి చెప్పడం జరిగిందన్నారు. నకరెకల్ లో నాపై పోస్టర్లు ఎవరు వేశారో నాకు తెలుసు అని పేర్కొన్నారు. నన్ను తిడితే టికెట్ వస్తుందని అనుకుంటున్నారన్నారు. నన్ను సస్పెండ్ చేయాలని, దరిద్రులు అనడం వల్లే.. బాధతో మాట్లాడానని పేర్కొ న్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement