Tuesday, November 19, 2024

ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో భారం కానున్న ఈఎంఐలు…

ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో ఆ భారం రుణాలు తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తున్న వారిపై పడనుంది. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల నుంచి గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారు నెల వారి చెల్లించే వాయిదాల మొత్తం పెరగనుంది. 20 సంవత్సరాల కాలపరిమి తితో 25 లక్షలు గృహ రుణం తీసుకున్న వారిపై 7 శాతం వడ్డీకి నెల వాయిదాగా ప్రస్తుతం చెల్లిస్తున్న 19,382 రూపాయలు, ఇక నుంచి 20,756 కు పెరగనున్నాయి. అదనంగా నెలకు 1374 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వాహన కొనుగోలుకు 10 శాతం వడ్డీతో 7 సంవత్సరాల్లో చెల్లిచేలా 10 లక్షలు రుణం తీసుకున్న వారు నెలవారి ఈఎంఐ ప్రస్తుతం చెల్లిస్తున్న 16,601 నుంచి 17,070 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా 469 రూపాయల భారం పడుతుంది. 14 శాతం వడ్డీకి ఐదేళ్లలో చెల్లించేలా 6 లక్షలు వ్యక్తిగత రుణం తీసుకున్నవారు 13,961 రూపాయలకు బదులు ఇక నుంచి 281రూపాయలు అదనంగా నెలవారి ఈఎంఐగా 14,242 చెల్లింంచాల్సి ఉంటుంది.

డిపాజిటర్లకు లాభం…

ఆర్బీఐ వడ్డీ రెట్లు పెంచడంతో బ్యాంక్‌ల్లో డబ్బులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసే వారికి అదనంగా ప్రయోజనం కలగనుంది. 36 రోజుల్లోనే ఆర్బీఐ రెపోరేటును రెండుసార్లుగా 0.9 శాతం పెంచింది. ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే వారికి సంతోషకరమైన వార్త. కరోనా సంక్షోభ సమయంలో బ్యాంక్‌ల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోయాయి. వడ్డీ రేట్ల పెంపుతో మళ్లి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు పెరుగుతాయని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2014లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ గరిష్టంగా 9 శాతం వడ్డీ రేటు ఆఫర్‌ చేసింది. కరోనా సమయంలో దీన్ని 5.4 శాతానికి తగ్గించింది. దీని వల్ల డిపాజిట్లు చేసిన వారు ఆర్థికంగా నష్టపోయారు. ఫలితంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసే వారి సంఖ్య కూడా తగ్గిపోతూ వచ్చింది. తాజాగా ఆర్బీఐ స్వల్ప వ్యవధిలోనే వడ్డీరేట్లను రెండుసార్లు పెంచడంతో ఇప్పటికే పలు బ్యాంక్‌లు డిపాజిట్ల సేకరణకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. పెరిగిన వడ్డీరేట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే వారికి ప్రోత్సహకరంగా ఉన్నందున ఈ సంఖ్య పెరుగుతుందని బ్యాంక్‌లు అంచనా వేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement