Thursday, July 4, 2024

నూత‌న డీఆర్డీవోగా – సమీర్ వి కామ‌త్

గ‌త కొంత‌కాలంగా డీఆర్డీవో ప‌నితీరు ప‌ట్ల కేంద్రం అసంతృప్తితో ఉంది. అందుకే ప్రముఖ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన సమీర్ వి కామత్ ను ఏరికోరి నూత‌న చైర్మ‌న్ గా నియమించారు. భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) నూతన చైర్మన్ గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ నియమితులయ్యారు. ఇప్పటివరకు డీఆర్డీవో చైర్మన్ గా జి.సతీశ్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. సతీశ్ రెడ్డి స్థానంలో డీఆర్డీవో అధిపతిగా సమీర్ వి కామత్ నేడు బాధ్యతలు అందుకున్నారు. 59 ఏళ్ల సతీశ్ రెడ్డి నాలుగేళ్ల పదవీకాలం నేటితో ముగియనుంది.

సతీశ్ రెడ్డిని కేంద్ర రక్షణ మంత్రి సైంటిఫిక్ అడ్వైజర్ గా నియమించారు. సమీర్ వి కామత్ ప్రస్తుతం విశాఖపట్నంలో డీఆర్డీవోకు చెందిన నావల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ గా, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయన 1985లో ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి మెటలర్జికల్ ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. 1988లో అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ నుంచి మెటీరియల్ సైన్స్ లో పీహెచ్ డీ చేశారు.ఆయన తొలుత డీఆర్డీవో హైదరాబాద్ విభాగంలో సైంటిస్టు-సి గా ప్రస్థానం ప్రారంభించారు. 2013లో ఆయనకు హెచ్ కేటగిరీ శాస్త్రవేత్తగా పదోన్నతి లభించింది. పదార్థాల యాంత్రిక ప్రవర్తన అంశంలో ఆయన నిపుణుడిగా పేరుగాంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement