Saturday, November 23, 2024

దూసుకుపోతున్న టీ వ‌ర్క్స‌.. టెక్నాల‌జీ దిగ్గ‌జం హువై తో ఒప్పందం..

ప్ర‌భ‌న్యూస్ : దేశంలోనే అతిపెద్ద హార్డ్‌వేర్‌ ప్రొటోటైప్‌ కేంద్రం టీ వర్క్స్‌ కొత్త మైలురాయిని చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమై తయారీ రంగంలో ఎంతో మంది యువవ్యాపారవేత్తలకు ఇంక్యుబేషన్‌ కేంద్రంగా పనిచేస్తున్న టీ వర్క్స్‌ కొత్త సాంకేతికత కోసం టెక్నాలజీ దిగ్గజం హువైతో చేతులు కలిపింది. రానున్న రోజుల్లో ప్రొటోటైపింగ్‌కుగాను అత్యాధునిక సాంకేతికతను హువై టీ వర్క్స్‌కు అందించనుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకుగాను టీ వర్క్స్‌, హువై మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ సహకార ఒప్పం దంలో భాగంగా అత్యాధు నిక ప్రొటోటైపింగ్‌ పరికరాలైన అడ్వాన్స్‌డ్‌ త్రీడీ ప్రింటర్లు, లేజర్‌ కట్టర్లు, ఎలక్ట్రానిక్స్‌ పిక్‌ అండ్‌ ప్లేస్‌లను టీ వర్క్స్‌కు అందించనుంది.

టీ వర్క్స్‌ కోసం 2లక్షల40వేల చదరపు అడుగుల కార్యాలయం కోసం 4.79 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఇందులో భాగంగా తొలి దశ 78వేల స్క్వేర్‌ ఫీట్‌తో ఇప్పటికే సిద్ధమైంది. టీ వర్క్స్‌లో నవ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, ఎస్‌ఎంఈలు, కార్పొరేట్‌ కంపెనీలు ఏవైనా సరే ఒక ఐడియాతో వచ్చి పారిశ్రామిక ఉత్పత్తిచేసే విధంగా వస్తువును తయారు చేసు కొని వెళ్లేందుకు గాను సదుపాయాలు కల్పించారు. ఈ మౌలిక సదుపాయాలతో పాటు టీవర్క్‌స్స్ లో 100 మంది దాకా ఇంజనీర్లు, డిజైనర్లు, సాంకేతిక నిపుణులు, సపోర్టిం గ్‌ సిబ్బంది అందుబాటులో ఉన్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement