Sunday, November 10, 2024

Emerging Asia Cup | ఎమర్జింగ్ కప్ ఆఫ్గాన్ సొంతం !

ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు విజేత‌గా నిలిచింది. ఈరోజు జరిగిన ఫైనల్స్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆఫ్గాన్.. శ్రీలంక ఏ పై అద్బుత విజయం సాధిచిం… ఎమర్జింగ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన‌ శ్రీలంక స్వ‌ల్ప ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. టాపార్డ‌ర్ గోరంగా విఫ‌ల‌మ‌య్యింది. ఈ క్ర‌మంలో సహన్ అరాచ్చిగే (64 నాటౌట్) జ‌ట్టుకు కాస్త ప‌రుగులు జోడించాడు. దీంతో శ్రీలంక నిర్ణీత ఓవ‌ర్ల‌లో 133/7 ప‌రుగులు చేసింది. ఆఫ్గాన్ బౌలర్లలో బిలాల్ సామి మూడు వికెట్లు తీయగా… గజన్‌ఫర్ రెండు వికెట్లు దక్కంచుకున్నాడు.

అనంతరం స్వ‌ల్ప టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఆఫ్గాన్ ఏ జ‌ట్టు అద‌ర‌గొట్టింది. సెడిఖుల్లా అటల్ (55 నాటౌట్) అజేయ అర్థ శ‌త‌కంతో చెల‌రేగాడు. అత‌నికి తోడు కెప్టెన్ దర్విష్ రసూలీ (24), కరీం జనత్ (33) రాణించారు. దీంతో శ్రీలంక నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆఫ్ఘన్ జట్టు సులువుగా ఛేదించి ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్ ను కైవసం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement