Thursday, January 9, 2025

Emergency – రండి …. మీ నాన‌మ్మ సినిమా క‌ల‌సి చూద్దాం

ప్రియాంకా గాంధీకి కంగ‌నా ర‌నౌత్ ఆహ్వానం..
‘ఎమర్జెన్సీ’ పేరుతో ఇందిరాగాంధీ జీవిత చరిత్ర మూవీ
ఈ నెల 17 న దేశ వ్యాప్తంగా విడుద‌ల

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బిజెపి ఎంపి కంగనా రనౌత్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ . దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటించింది. ఈ చిత్రం గ‌తేడాది ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉండ‌గా.. అనుకోని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. అయితే రీసెంట్‌గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 17న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ను కూడా పంచుకుంది. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా 10 రోజులే ఉండ‌డంతో వ‌రుస ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోంటుంది కంగనా.

- Advertisement -

ఈ క్ర‌మంలోనే ‘ఎమర్జెన్సీ’ సినిమాను ఇద్ద‌రం క‌లిసి చూద్దాం ర‌మ్మంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని ఆహ్వానించింది ప్రియాంకా గాంధీ… ఈ మూవీకి ప్రియాంకాను ఆహ్వ‌నించ‌డంపై కంగ‌నా మాట్లాడుతూ, ఇటీవ‌ల పార్లమెంటులో ప్రియాంక గాంధీని క‌లిశాను. ఆమెని క‌లిసిన అనంత‌రం నేను చెప్పిన మొద‌టి మాట.. ఆప్కో ఎమర్జెన్సీ దేఖ్నీ చాహియే (మీరు ఎమర్జెన్సీ సినిమాని చూడాలి). మీకు ఇది బాగా నచ్చుతుంది అంటూ ప్రియాంకాకు చెప్పాను. ఇప్పుడు స్వ‌యంగా ఆహ్వానిస్తునట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement