Saturday, November 23, 2024

ఎలాన్‌ మస్క్‌కు మళ్లీ నిరాశ.. పన్నుమినహాయింపులను తిరస్కరించిన భార‌త్

ఎలక్ట్రిక్‌ కార్ల దిగుమతికి పన్ను మినహాయింపులు కోరుతున్న ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. పన్ను విరామం డిమాండ్లను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. పాక్షికంగా నిర్మించిన కార్లను దిగుమతి చేసుకుని భారత్‌లో అమరిక చేపడితే కనిష్ఠ పన్నులు ఉంటాయని, ఇప్పటికే ఈ నిబంధన కొనసాగుతోందని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డ్‌ చైర్మన్‌ వివేక్‌ జోహ్రి స్పష్టం చేశారు. పన్నుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందోలేదో పరిశీలిస్తన్నాం. ప్రస్తుతం దేశీయంగా కొంత ఉత్పత్త జరుగుతోంది. ప్రస్తుత టారిఫ్‌ విధానంలో కొన్ని పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు.

భారత పన్నులు అవరోధం కాదనే విషయం స్పష్టమైందని ఆయన చెప్పారు. భారత్‌లో ఉత్పత్తి, ఎగుమతులకు సంబం ధించిన ప్రణాళికలను టెస్లా ఇంకా అందించలేదని జోహ్రీ వివరించారు. ప్రభుత్వం కోరినా ఎలాంటి వివరాలను తెలపలేదు. అయితే భారత్‌లోని ఐదు రాష్ట్రాలు తమ వద్ద టెస్లా కార్ల యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ అభ్యర్థనలపై మస్క్‌ ఇంతవరకు స్పందించలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement