ధాన్యం సేకరణలో తొలిసారి మిల్లర్ల ప్రమేయాన్ని తొలగించామని, కొత్త విధానం ఎలా అమలవుతోందో అధికారులు గమనించాలని సీఎం జగన్ అన్నారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ, కొనుగోళ్ల అంశంపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర కంటే పైసా తగ్గకుండా ఉండాలనే కొత్త విధానం తీసుకువచ్చామని వెల్లడించారు. గోనె సంచులు సిద్ధం చేయాలని, కూలీ ఖర్చుల రీయింబర్స్ లో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. రైతులకు చేసే చెల్లింపులన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement