– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
2018, జనవరి 1న భీమా కోరేగావ్‌లో దళిత సంఘ సభ్యులపై జరిగిన కుల హింసకు, 2017 డిసెంబర్ 31న ఎల్గార్ పరిషత్‌లో జరిగిన సమావేశానికి ఎట్లాంటి సంబంధం లేదని కేసు పరిశోధిస్తున్న సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పూణె నగరంలో 30 కిలోమీటర్ల దూరంలో నిర్వహించిన ఎల్గార్ పరిషత్ కార్యక్రమానికి, ఆ మరుసటి రోజు జరిగిన హింసకు ఎటువంటి పాత్ర లేదని ప్రమాణం చేశారు. కాగా, ఈ కేసు పరిశోధించడానికి ఇద్దరు సభ్యుల న్యాయ కమిషన్ ముందు సబ్-డివిజనల్ పోలీసు అధికారి గణేష్ మోర్ చేసిన ఈ కీలక వివరాల వెల్లడి, పూణే పోలీసులకు చెంపపెట్టులా మారింది. తర్వాత ఒక ప్రత్యేక కేసులో అరెస్టయిన 16 మంది మానవ హక్కుల కార్యకర్తలపై జాతీయ దర్యాప్తు సంస్థ వాదనలు కూడా నిజం కాదని వెల్లడవుతోంది. ఎల్గార్ పరిషత్ కార్యక్రమం డిసెంబర్ 31, 2017న కులతత్వ బ్రాహ్మణ పీష్వా పాలనలో ఉన్న మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా బ్రాహ్మణ కేంద్రమైన శనివార్ వాడాలో నిర్వహించారు. కాగా, ఆ మరుసటి రోజు 2018, జనవరి 1 న భీమా కొరేగావ్‌లో అల్లర్లు చెలరేగాయి.
కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి JN పటేల్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల న్యాయ కమిషన్, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సుమిత్ ముల్లిక్ 2018 ప్రారంభంలో విచారణను ప్రారంభించింది. అప్పటి నుండి కమిషన్ అనేక మార్లు ఈ కేసును పొడిగిస్తూ వస్తోంది. పూణేలో సాధారణ విచారణలను నిర్వహించింది. బాధితులతో పాటు పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగం సహా రాష్ట్ర యంత్రాంగం కూడా అఫిడవిట్లు దాఖలు చేసింది. ఈ కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయడానికి ముందు పూణే పోలీసులు ఈ సదస్సుకు మావోయిస్టుల మద్దతు ఉందని పేర్కొన్నారు.
రచయిత, ముంబైకి చెందిన దళిత హక్కుల కార్యకర్త సుధీర్ ధావలే.. గడ్చిరోలికి చెందిన యువ కార్యకర్త మహేశ్ రౌత్, నాగపూర్ విశ్వవిద్యాలయం ఆంగ్ల సాహిత్య విభాగం మాజీ అధిపతి షోమా సేన్, న్యాయవాదులు అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, సామాజిక కార్యకర్త-రచయిత వరవర రావు, సామాజిక కార్యకర్త వెర్నాన్ గోన్సాల్వేస్, ఖైదీల హక్కుల కార్యకర్త రోనా విల్సన్, నాగ్‌పూర్‌కు చెందిన UAPA నిపుణుడు.. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, గిరిజన హక్కుల కార్యకర్త దివంగత ఫాదర్ స్టాన్ స్వామి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబు, పండితుడు, ఉద్యమకారుడు ఆనంద్ తెల్తుంబ్డే, పౌర హక్కుల కార్యకర్త గౌతం నవ్‌లాఖా , కబీర్ కళా మంచ్ సభ్యులు సాగర్ గోర్ఖే, రమేష్ ఘైచోర్, జ్యోతి జగ్తాప్ ఈ కేసులో అరెస్టయిన పదహారు మంది సభ్యులు. తెల్తుంబ్డే, భరద్వాజ్.. వరవరరావు బెయిల్‌పై విడుదలయ్యారు.. అయితే రాష్ట్ర నిర్లక్ష్యం, తగిన వైద్యం అందించడంలో వైఫల్యం ఫలితంగా స్వామి గత సంవత్సరం మరణించారు.
ఈ 16 మంది భీమా కోరేగావ్ వద్ద గుమిగూడిన జనాన్ని తమ ప్రసంగాలతో “రెచ్చగొట్టడం”.. హింసను ప్రేరేపించడంలో చురుకుగా పాల్గొన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తెలిపింది. ముగ్గురు వ్యక్తులు బెయిల్‌పై విడుదలయ్యారు. ఒకరు కస్టడీలో మరణించగా, మిగిలిన 12 మంది ముంబై జైలులో ఉన్నారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన మోరే, ఈ ఏడాది ఏప్రిల్‌లో కొనసాగుతున్న డిపాజిషన్‌లో తన అధికార పరిధిలో దాఖలు చేసిన తొమ్మిది అట్రాసిటీ కేసులకు ఎల్గార్ పరిషత్ ఈవెంట్‌లో ఎలాంటి పాత్ర లేదని అంగీకరించాడు.
“జనవరి 1, 2018న జరిగిన అల్లర్ల సంఘటన, 2017 డిసెంబర్ 31న పూణెలోని శనివార్ వాడాలో ఎల్గార్ పరిషత్‌ను నిర్వహించడం వల్లే జరిగిందని చూపించడానికి నాకు ఎలాంటి సమాచారం లేదా మెటీరియల్ కనిపించలేదు” అని మోర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ది వైర్ నివేదిక ప్రకారం.. హింసాకాండకు సంబంధించిన సాక్షులలో ఒకరి తరపున న్యాయవాది రాహుల్ మఖరే హాజరయ్యారు. ఇటీవల పదవీ విరమణ చేసిన, హింస సమయంలో పూణే సిటీ పోలీసు అదనపు కమిషనర్ (దక్షిణ ప్రాంతం)గా పనిచేసిన IPS-ర్యాంక్ అధికారి రవీంద్ర సెంగావ్కర్ అనే మరో సాక్షిని కూడా నివేదిక ఉదహరించింది. ఇటీవలి కాలంలో కమిషన్ అతనిని ప్రశ్నించిందని పేర్కొంది.
ఇక.. డిసెంబర్ 31, 2017న ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో చేసిన ప్రసంగాల స్వభావం గురించి అడిగినప్పుడు, అవి రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, స్పీకర్లపై, ముఖ్యంగా విద్యార్థుల హక్కుల కార్యకర్తలు ఉమర్ ఖలీద్.. దొంత ప్రశాంత్, గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీలపై చర్యలు తీసుకున్నారని సెంగోకర్ పేర్కొన్నారు. జర్నలిస్ట్, కుల వ్యతిరేక కార్యకర్త సుధీర్ ధావలే (ఈ కేసులో ఇప్పటికే అరెస్టయ్యారు). ప్రసంగం యొక్క స్వభావం రెచ్చగొట్టే విధంగా ఉందని.. ఇది వెంటనే స్పష్టమైందని సెంగావోకర్ పేర్కొన్నారు. అయినప్పటికీ, పోలీసులు “వెంటనే అరెస్టును నమోదు చేయలేదని” అతను అంగీకరించాడు.
సేన్‌గావోకర్ చేసిన ఈ అంగీకారం ముఖ్యమైనది. ఎందుకంటే ఎల్గార్ పరిషత్ కేసులో డిఫెన్స్ లాయర్లు హక్కుల కార్యకర్తలపై కేసు మానవ హక్కుల రక్షకులను తప్పుగా ఇరికించడం కోసం చేసిన దానిగా చెబుతున్నారు. ఈ 16మందిపై దేశానికి వ్యతిరేకంగా పని చేయడం, నిషేధిత ఉగ్రవాద సంస్థ CPI (మావోయిస్ట్), నేరపూరిత కుట్ర, పేలుడు పదార్థాలను ఉపయోగించి ప్రజల మనస్సుల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశ్యంతో చర్యలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. NIA తన ముసాయిదా ఆరోపణలలో నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), ఇండియన్ పీనల్ కోడ్ (IPC) యొక్క వివిధ నిబంధనల ప్రకారం అభియోగాలు మోపాలని కోరింది.
ఈ కేసులో అరెస్టయిన 16 మంది పరిస్థితి ఎలా ఉంది:
- 2018 జూన్‌లో ఈ కేసులో అరెస్టయిన మొదటి వ్యక్తులలో కార్యకర్త సుధీర్ ధావలే ఒకరు. అతను ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నారు. ఉగ్రవాద సంస్థలో క్రియాశీల సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జులైలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఆయన బెయిల్‌ను తిరస్కరించింది.
- కార్యకర్త రోనా విల్సన్‌ని జూన్ 2018 లో ఢిల్లీలోని అతని ఇంటిలోనే అరెస్టు చేశారు. అప్పటి నుండి జైలులో ఉన్నారు. అర్బన్ మావోయిస్టుల అగ్రనేతగా ఆయనను అభివర్ణించారు. అతని బెయిల్ అభ్యర్థనను ప్రత్యేక కోర్టు జులై 2022లో తిరస్కరించింది. విల్సన్ తన తండ్రి మరణం తర్వాత 30వ రోజు కర్మ కోసం ఏర్పాటు చేసిన సామూహికానికి హాజరయ్యేందుకు సెప్టెంబర్ 2021లో ప్రత్యేక NIA కోర్టు ద్వారా 14 రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అతను 14 రోజుల వ్యవధి ముగింపులో లొంగిపోయారు.
- లాయర్ సురేంద్ర గాడ్లింగ్ 2018లో అరెస్టయ్యారు. అప్పటి నుండి జైలులో ఉన్నారు. NIA తెలిపిన వివరాల ప్రకారం.. గాడ్లింగ్ CPI (మావోయిస్ట్)లో క్రియాశీల సభ్యుడు.. నిధుల సేకరణ కార్యకలాపాలు, పంపిణీలో పాల్గొన్నాడు. పూణెలోని కోరెగావ్ భీమాలో జరిగిన హింసాకాండకు గాడ్లింగ్ మార్గనిర్దేశం చేసినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. జులై 2022లో ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ను కూడా తిరస్కరించింది.
- ప్రొఫెసర్ షోమా సేన్‌ను జూన్ 2018లో అరెస్టు చేసి అప్పటి నుంచి బైకుల్లా మహిళా జైలులో ఉంచారు. ఆమె 2021లో వైద్యపరమైన కారణాలు, పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా బెయిల్‌ను కోరింది. అయితే ఆమె బెయిల్ పిటిషన్‌ను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. జూలై 2022లో, డిఫాల్ట్ బెయిల్ కోరుతూ ఆమె చేసిన విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది.
- మహేశ్ రౌత్ అనే కార్యకర్త మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసి నక్సలైట్ ఉద్యమంలో చేరేందుకు విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎల్గార్ పరిషత్ ఈవెంట్ కోసం ఈ కేసులో సహ నిందితులకు రౌత్ రూ. 5 లక్షలను అందజేసినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. అతనిని 2018లో అరెస్టు చేశారు. ఇప్పటికీ అతను జైలులోనే ఉన్నాడు. అతని డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఈ ఏడాది ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.
- ఎనభై రెండేళ్ల తెలుగు కవి వరవరరావుకు ఆగస్టు 10, 2022న సుప్రీంకోర్టు మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. గత సంవత్సరం బాంబే హైకోర్టు వైద్య కారణాలతో తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అతను ఆగస్టు 2018లో అరెస్టయ్యాడు. ఫిబ్రవరి 2021 వరకు జైలులో ఉన్నాడు. హైకోర్టు అతనికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత గ్రూపులో సీనియర్, క్రియాశీల సభ్యుడిగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
- సామాజిక కార్యకర్త, న్యాయవాది అరుణ్ ఫెరీరా ఆగస్టు 2018లో ఈ కేసులో అరెస్టయ్యారు. ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నారు. ఈ కేసులో అతను డిఫాల్ట్ బెయిల్‌ను కోరాడు. అయితే దానిని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు, బాంబే హైకోర్టు రెండూ తిరస్కరించాయి. ఫెరీరా మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని ఆరోపించారు.
- ఈ కేసులో వెర్నాన్ గోన్సాల్వేస్ ఆగస్ట్ 2018లో అరెస్టయ్యాడు. ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నాడు. అతని బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు, హైకోర్టు రెండూ తిరస్కరించడంతో అతను బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
- 2021 డిసెంబర్‌లో బాంబే హైకోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్‌పై బయట ఉన్న ఈ కేసులో కార్యకర్త సుధా భరద్వాజ్ మరో నిందితురాలు. ఆమె ఆగస్ట్ 2018లో అరెస్టు అయ్యారు. బెయిల్‌పై విడుదలైన డిసెంబర్ 2021 వరకు జైలులో ఉన్నారు. NIA వివరాల ప్రకారం సుధా భరద్వాజ్ CPI (మావోయిస్ట్)లో క్రియాశీల సభ్యురాలు.
- ఆనంద్ తెల్తుంబ్డే కార్యకర్త, బోధకుడు. సుప్రీంకోర్టు నుండి ముందస్తు బెయిల్ నుండి ఉపశమనం పొందకపోవడంతో లొంగిపోయిన తరువాత ఏప్రిల్ 2020లో NIA అరెస్టు చేసింది. అతను ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నాడు. అతని బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.
- డెబ్బై ఏళ్ల కార్యకర్త గౌతమ్ నవ్లాఖా ఆగస్టు 2018లో ఈ కేసులో అరెస్టయ్యాడు. అప్పటి నుండి తలోజా జైలులో ఉన్నాడు. అక్టోబర్ 2021లో అతను అండా సెల్ (హై సెక్యూరిటీ బ్యారక్స్)కి మార్చబడ్డాడు. అప్పటి నుండి ఏకాంత నిర్బంధంలో ఉంచారు.
- ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబు ఈ కేసులో జూలై 2020లో అరెస్టయ్యాడు. ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నాడు. బెయిల్ కోసం ఆయన ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. అది ఇంకా విచారణకు రాలేదు. సీపీఐ(మావోయిస్ట్) నేతల సూచనల మేరకు మావోయిస్టు కార్యకలాపాలు, సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో బాబు సహచరుడిగా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏ ఆరోపించింది.
- జెస్యూట్ పూజారి స్టాన్ స్వామి (83) జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే చనిపోయాడు. అంతకుముందు మెడికల్ బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అతను 2021 జూలై 5 న మరణించాడు. దీనికి ముందు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అతన్ని అక్టోబర్ 2020లో NIA అరెస్టు చేసింది. అప్పటిదాకా అతనిని కూడా తలోజా జైలులో ఉంచారు.
- సాగర్ గోర్ఖే, గాయకుడు, కుల వ్యతిరేక కార్యకర్త .. సెప్టెంబరు 2020లో NIA అరెస్టు చేసింది. అతను ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నాడు.
- రమేష్ గైచోర్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసి తలోజా జైలులో ఉంచింది. ఎల్గార్ పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన బృందంలో రెచ్చిపోయి ప్రసంగాలు చేశారనే ఆరోపణలున్నాయి.
- కబీర్ కళా మంచ్ సభ్యుడు జ్యోతి జగ్తాప్, నక్సలైట్ కార్యకలాపాలు, మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేశారనే ఆరోపణపై సెప్టెంబర్ 2020లో అరెస్టు చేశారు. ఆమె ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా మహిళా జైలులో ఉన్నారు.