దేశంలోనే అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆపార్టీకి రూ.11,562 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండో ప్లేస్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. దానికి రూ.3,214 కోట్లు వచ్చాయి. మూడో ప్లేస్‌లో నిలిచిన కాంగ్రెస్‌కు రూ.2,818 కోట్లు, నాలుగో ప్లేసులోని భారత రాష్ట్ర సమితికి రూ.2,278 కోట్లు ఎన్నికల బాండ్ల జారీ ద్వారా అందాయి. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌కు రూ.1550 కోట్లు, తమిళనాడును పాలిస్తున్న డీఎంకే పార్టీకి రూ.1230 కోట్లు, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి రూ.662 కోట్లు విరాళంగా వచ్చాయి. టీడీపీకి రూ.437 కోట్లు, జనసేన పార్టీకి రూ.42 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు రూ.316 కోట్లు, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీకి రూ.145 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.130 కోట్లు విరాళంగా అందాయి..
2018 నుంచి ఇప్పటివరకు బీజేపీకి అత్యధికంగా 8,633, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 3,305, కాంగ్రెస్ పార్టీకి 3,146, ఆమ్ ఆద్మీ పార్టీకి 245, డీఎంకేకు 648, బాండ్ల జారీ ద్వారా డొనేషన్స్ వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి 1,806 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 472, టీడీపీకి 279, జనసేన పార్టీకి 39 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందాయి.
ఈమేరకు ఎస్బీఐ ఇచ్చిన డేటాను నేడు కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్ సైట్ లో ఉంచింది.