Tuesday, November 26, 2024

Exclusive : పెద్దాస్పత్రిలో కరెంటు కష్టాలు.. ఇబ్బందిపడుతున్న బాలింతలు, నవజాత శిశువులు..

ప్రభన్యూస్, ప్రతినిధి భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (వంద పడకల ఆసుపత్రి)లో గురువారం తెల్లవారుజాము నుండి విద్యుత్ లేక బాలింతలు, నవజాత శిశువులు,డెలివరికి వచ్చిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో ఆస్పత్రిలో నీటి ఇబ్బందులు తలెత్తాయి. దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బాలింతలు, డెలివరికి వచ్చిన గర్భిణులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత ఆస్పత్రి సూపరిండెంట్ కి విన్నవించిన ఇప్పటికీ ఎలాంటి ఫలితం లేదంటున్నారు.

ఉదయం ఇప్పటివరకు విద్యుత్ రాలేదని కనీసం ఇప్పటి వరకు మా బాధలు పట్టించుకున్న నాధుడే కరువయ్యారు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరేటర్ ఉన్న కనెక్షన్ లేక అలంకారప్రాయంగా నిలిచిందని దాని నుండి విద్యుత్ సరఫరా చేయడం లేదు. రాత్రి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే చీకటిలో ఎలా ఉండాలని, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు కోరుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement