Friday, November 22, 2024

AP | విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రిక్ర్‌ వాహనాల తయారీ ల్యాబ్‌

అమరావతి, ఆంధ్రప్రభ : పాలిటెక్నిక్‌ విద్యను పరిశ్రమకు అనుసంధానించే క్రమంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రిక్ర్‌ వాహనాల తయారీ ల్యాబ్‌, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు అవెరా సంస్ధ ముందుకు వచ్చిందని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోని సౌకర్యాలు, ఇతర వనరులను పరిశీలించుకునేందుకు శుక్రవారం సంస్ధ ప్రతినిధి బృందం కళాశాలను సందర్శించిందన్నారు.

అవెరా ఇ వెహికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ సిఇఓ, భారత పరిశ్రమల సమాఖ్య విజయవాడ చాప్టర్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వెంకట రమణ, ఓఎస్‌డి కార్తికేయతో పాటు సాంకేతిక విద్యాశాఖ సంయిక్త సంచాలకులు వెలగా పద్మారావు, ఎస్‌బిటిఇటి కార్యదర్శి రమణబాబు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో అందుబాటులో ఉన్న పలు భవనాలను పరిశీలించారని నాగరాణి వివరించారు. ప్రస్తుతం ప్రయోగశాల ఉన్న ప్రాంతం ఆధునాతన ల్యాబ్‌ ఏర్పాటుకు అనుకూలంగా లేదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయన్నారు.

ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ క్లాస్‌ రూమ్‌లో స్వల్ప మార్పులు చేయటం తొలి ప్రతిపాదన కాగా, నిర్మాణంలో ఉన్న నూతన భవనం గ్రౌండ్‌ ప్లnోర్‌ కేటాయింపు మరో ప్రతిపాదనగా ఉందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న భవనం గ్రౌండ్‌ ప్లnోర్‌లో ప్రయోగశాలను స్థాపించడానికి సరిపోతాయని ప్రాధమికంగా గుర్తించారని, పూర్తి స్ధాయి పరిశీలన అనంతరం అవెరా సంస్ధతో తగిన ఒప్పందం చేసుకుంటామని నాగరాణి స్ఫష్టం చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement