Saturday, November 23, 2024

Electric Vehicle : ఈ-బైక్ బ్యాటరీలు నాణ్యమైనవా? నకిలీవా?

  • బ్యాటరీల నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబరేటరీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
  • విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీలు టీఎస్‌ రెడ్‌కో వద్ద నవెూదు చేసుకోవాల్సిందే
  • ప్రణాళికలు రూపొందిస్తున్నరాష్ట్ర ప్రభుత్వం
  • ఈ బైక్ ల‌ బ్యాటరీల పేలుళ్లకు చెక్ పెట్టాలని నిర్ణయం

హైదరాబాద్ : విద్యుత్‌ వాహనాలు ఇటీవల (ఎలక్ట్రిక్‌ బైక్స్‌) వరసగా పేలిపోతుండటంతో వాటి బ్యాటరీల నాణ్యతను పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో బ్యాటరీల నాణ్యతను గుర్తించే ల్యాబ రేటరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. బ్యాటరీ తయారైనప్పుడు వాటి నాణ్యతను పరీక్షించడానికి ఒక తమిళనాడులో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ల్యాబ రేటరీలు ఇప్పటివరకు అందుబాటులో లేవు. తమిళనాడులో ఉన్న ల్యాబ రేటరీని ఒక ప్రైవేట్‌ కంపెనీ ఏర్పాటు చేసింది. అక్కడ బ్యాటరీల నాణ్యతను పరీక్షించడానికి సరైన సిబ్బంది లేకపోవడంతో.. నాణ్యత గురించి పెద్దగా పట్టించు కోవడం విమర్శలు వినిపిస్తున్నాయి. 1,000 బ్యాటరీల నాణ్యతను ఆ ల్యాబరేటరిలో పరీక్షించాల్సి వచ్చినప్పుడు అక్కడి సిబ్బంది 10 లోపు బ్యాటరీలను పరీక్షించి.. మిగతా వాటికి కూడా ఒకే అని సర్టిఫికెట్‌ ఇస్తున్నారని, దీంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే బ్యాటరీ తయా రీ సందర్భంలో సెల్స్‌, మాడ్యూల్స్‌ లోప భూయిష్టంగా ఉందా..? సరైన విధంగా ఉందా..? అనే విషయాన్ని నిర్థారించుకుంటే బ్యాటరీ పేలుళ్లకు అవకాశం ఉండదని టీఎస్‌ రెడ్‌కో అధికారులు చెబుతున్నారు.

4 వీలర్‌ వాహనాల బ్యాటరీలు నాణ్యమైనవేనా..?
అయితే 4 వీలర్‌ ఎలక్ట్రానిక్‌ వాహనాల్లో వాడే బ్యాటరీలకు, టూ వీలర్‌ ఎలక్ట్రానిక్‌ వాహనాల్లో వాడే బ్యాటరీలకు నాణ్యతలో చాల వ్యత్యాసం ఉంటుందని, వాటి నాణ్యను కచ్చితంగా చెక్‌ చేయించడంతో పాటు నాణ్యమైన బ్యాటరీలును వాడుతున్నారని అధికారులు చెబుతున్నారు. అందుకే ఎక్కడా కూడా 4 వీలర్‌ ఎలక్ట్రానిక్‌ వాహనాల బ్యాటరీలు పేలడం తక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడతున్నారు. అయితే 2 వీలర్‌, 4 వీలర్‌ ఎలక్ట్రానికి వాహ నాల బ్యాటరీల నాణ్యత ప్రమాణాలను తెలుసుకోవాలంటే రాష్ట్రంలో ఆర్‌డీ ఉండే ల్యాబ్‌ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

బ్యాటరీల పేలుళ్లు వరసగా జరుగుతుండటంతో.. వాటిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని భావిస్తుంది. ఈ వెహికిల్స్‌ అమ్మె కంపెనీలన్ని టీఎస్‌ రెడ్కో వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు, వాటి నాణ్యత ప్రమాణాలను కూడా తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను రూ పొందిస్తున్నట్లుగా సమాచారం. అందులో భాగంగా ముందు జాగ్రత్తగా ల్యాబరేటరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది. నాణ్యమైన బ్యాటరీలను చెక్‌ చేసేందుకు దేశంలో ల్యాబ రేటరీల ఎక్కడా లేవు. తమిళనాడులో ఉన్న ల్యాబ రేటరిపైనే ఆధారపడాల్సి రావడంతో సమస్యలు మరిన్ని ఉత్పన్న మవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.

లిథియం ఆయాన్‌తో బ్యాటరీల తయారు..
విద్యుత్‌ వాహనాల్లో బ్యాటరీనే కీలకమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ వాహనాల్లో లిథియం ఆయాన్‌తో రూపొందించే బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీలో ఎక్కువగా చిన్న సంస్థలే ఉన్నాయి. తక్కువ ధరకు వామనాలను అందిచాలన్న ఉద్దేశ్యంతో తక్కువ ధరలో వచ్చే బ్యాటరీలను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. విద్యుత్‌ వాహనాలను తయారు చేసే కంపెనీలు నాసిరకం లిథియం ఆయాన్‌ బ్యాటరీల వాడకంతో పాటు బ్యాటరీ మెనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (బీఎంఎస్‌) సక్రమంగా పని చేయకపోతే అధిక చార్జింగ్‌తో పేలుళ్లు జరుగుతాయని నిపుణలు పేర్కొం టున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement