భారతదేశపు నెంబర్ వన్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కంపెనీ మహీంద్రా బుధవారం కీలక ప్రకటన చేసింది. 400 మిలియన్‌ల ఈ-కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించినట్టు తెలిపింది. ఇప్పటి వరకు సుమారు 40,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్‌ను వాతావరణంలో విడుదల కాకుండా నివారించినట్టు వివరించింది. ఇంత మేర కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో విడుదలయితే.. సుమారు 18.50 లక్షల చెట్లు నాటాల్సి వచ్చేదని తెలిపింది. పర్యావరణ హితం కోసం తమవంతు కీలక పాత్ర పోషిస్తున్నట్టు వివరించింది. జీరో కార్బన్ ఉద్గారాలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు తెలిపింది. కేవలం మూడేళ్ల కాలంలోనే.. 400 మిలియన్ ఈ-కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నట్టు తెలిపింది. భారతదేశ వాతావరణ వ్యవస్థపై తమకు ఉన్న ప్రేమను ఇది తెలియజేస్తుందని మహీంద్రా చెప్పుకొచ్చింది.
మహీంద్రా ఎలక్ట్రిక్, దేశంలోనే నెంబర్ వన్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కంపెనీగా ఉందని, దీనికి ఎంతో గర్వపడుతున్నట్టు ప్రకటించింది. కాలుష్య రహిత లాస్ట్ మైల్ మొబిలిటీ సొల్యూషన్‌లను అందించడానికి కట్టుబడి ఉందని చెప్పుకొచ్చింది. 19.4 బిలియన్ డాలర్ల మహీంద్రా ఎలక్ట్రిక్ గ్రూప్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి ఓ భాగమని తెలిపింది. ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండిందని వివరించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఈవీ సాంకేతికతలతో భారతదేశ ఏకైక ఈవీ తయారీదారు అని, ప్రపంచ దేశాల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంటోందని తెలిపింది. ప్రత్యామ్నాయ సాంకేతిక వ్యవస్థలోకి ప్రవేశించడంతో భారతదేశానికి క్లీన్, గ్రీన్ ఎనర్జీ ఎనేబుల్‌కు మహీంద్రా ఎలక్ట్రిక్ సహాయపడుతుందని ప్రకటించింది. 1945లో స్థాపించిన మహీంద్రా గ్రూప్‌లో.. 2,60,000 మంది ఉద్యోగులు ఉండగా.. 100 దేశాల్లో సేవలు అందిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..