Monday, November 18, 2024

హోండా నుంచి విద్యుత్‌ మోటార్‌ సైకిళ్లు

జపాన్‌ వాహన తయారీ కంపెనీ హోండా 2025 నాటికి దేశీయంగానూ, అంతర్జాతీయ మార్కెట్‌లో 10 కంటే ఎక్కువ విద్యుత్‌ మోటార్‌ సైకిళ్లను విడుదల చేస్తామని ప్రకటించింది. వచ్చే ఐదు సంవత్సరాల్లో విద్యుత్‌ మోటారు సైకిళ్ల, సూటర్ల అమ్మకాలు సంవత్సరానికి పది లక్షలకు పైగా ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి కంపెనీ విక్రయించే వాహనాల్లో 15 శాతం (3.5 కోట్ల వాహ నాలు) ఉండేలా లక్ష్యం పెట్టుకున్నట్లు హోండా తెలిపింది. ప్రస్తుతం హోండా కంపెనీ చైనాలో ఎక్కువ విద్యుత్‌ వాహనాలను అమ్ముతోంది. వీటిలో ఎక్కువగా మోపెడ్లు, సైకిళ్లు ఉన్నాయి.

దేశంలో ఈ సంవత్సరం చివరి నాటికి బ్యాటరీ షేరింగ్‌ సేవలు ప్రారంభిస్తామని ప్రకటించింది. విద్యుత్‌ ఆటోలకు ఈ సేవలు సమకూర్చనున్నట్లు తెలిపింది. భవిష్యత్‌లో ద్విచక్ర వాహనాలకు కూడా ఈ సేవలను విస్తరిస్తామని పేర్కొంది. 2023 నాటికి ఇండియాలో ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌ మోడళ్లను విడుదల చేస్తామని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement