Wednesday, November 20, 2024

Breaking: ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీంకోర్టు

ఎలక్టోరల్ బాండ్ల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19(1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కల్గిస్తున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని తెలిపింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రో కో కు దారితీస్తుందని, బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement