సుప్రియకు కాంగ్రెస్ హైకమాండ్ షాక్
హిమాచల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగన
సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుప్రియా
వ్యక్తిగత దూషనలపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం
ఎంపీ టికెట్‌ను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం
బాలీవుడ్ నటి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌కు షాక్ తగిలింది. ఆమెను లోక్‌సభ అభ్యర్థుల జాబితా నుంచి పార్టీ హైకమాండ్ తొలగించింది. కంగనకు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ టికెట్‌ను బీజేపీ కేటాయించింది. ఈ నేపథ్యంలో కంగనను ఉద్దేశించి సోషల్ మీడియాలో సుప్రియా అనుచిత కామెంట్ చేశారు. కంగన బ్రా ధరించి ఉన్న ఫొటోను షేర్ చేయడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై కంగన ఘాటుగా స్పందించింది. సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ.. ఇతరులను దూషించడం మానుకోవాలని అన్నారు. మరోవైపు, ఆ పోస్టు తాను చేయలేదని, తన ఇన్‌స్టా, ఫేస్ బుక్ యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని తెలిపింది.
ఎన్నికల సంఘం సీరియస్..
ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సుప్రియకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రియ చేసిన వ్యాఖ్యలు హుందాగా లేవని వ్యాఖ్యానించింది. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల జీవితాల గురించి ఎలాంటి విమర్శలు చేయవద్దని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రియపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంది. లోక్‌సభ అభ్యర్థుల జాబితా నుంచి ఆమె పేరును పక్కన పెట్టింది. 2019లో ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ నుంచి సుప్రియ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పడు ఆమెను ఆ స్థానం నుంచి తప్పించి వీరేంద్ర చౌదని పేరును కాంగ్రెస్ ప్రకటించింది.