Tuesday, November 26, 2024

Elections – లోక్ సభ బరిలో పొంగులేటి వియ్యంకులు…


ఒక‌రు కాంగ్రెస్‌, మ‌రొక‌రు బీఆర్ఎస్
ఖ‌మ్మం బ‌రిలో దిగిన ఆర్‌. ర‌ఘ‌రాంరెడ్డి
మెదక్ నుంచి పోటీ చేస్తున్న‌ వెంక‌ట్రామిరెడ్డి
లోక్‌స‌భ కోసం కుటుంబంలోనే పోటాపోటీ
తెలంగాణ‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఇద్దరు వియ్యంకులు సార్వ‌త్రిక ఎన్నికల బరిలో నిలిచారు. ఒకరు ఖమ్మం కాంగ్రెస్ లోక్‌స‌భ స్థానానికి పోటీ చేస్తుండ‌గా.. ఇంకొక‌రు మెద‌క్ లోక్‌స‌భ‌కు పోటీలో ఉన్నారు. ఇక‌.. ఖ‌మ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా, మెదక్ బీఆర్ఎస్ లోక్‌స‌భ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి బ‌రిలో ఉన్నారు. మంత్రి పొంగులేటికి ఓ కొడుకు, కుమార్తె ఉండ‌గా.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కించుకున్న రామసహాయం రఘురాంరెడ్డి ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు. రఘురాం రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు.

ఇంకో వియ్యంకుడు..

మంత్రి పొంగులేటి మరో వియ్యంకుడు మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. పొంగులేటి తమ్ముడు ప్రసాద్‌రెడ్డి కుమారుడు వెంకట్రామిరెడ్డి ఇంటి అల్లుడు. పరోక్షంగా, బంధుత్వపరంగా పొంగులేటికి వెంకట్రామిరెడ్డి కూడా వియ్యంకుడే. అంటే.. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు వియ్యంకులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement