Thursday, November 21, 2024

Elections – ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటి ఇచ్చిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటింది. ఈ కూటమి అభ్యర్థులు ఏకంగా 11 స్థానాల్లో ముందంజలో ఉండగా బిజెపి కూటమి రెండు స్థానాలకు పరిమితమైంది.

ఇండియా కూటమి బోణీ 

ఇండియా కూటమి జలంధర్ స్థానాన్ని గెలుచుకుంది. మరో 10 స్థానాల్లో ముందంజలో ఉంది. పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మొహిందర్ భగత్ 23,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అభ్యర్థులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు రెండు స్థానాల్లో ఆధిక్యం సాధించగా, హమీర్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళూర్ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని అమర్వార్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా ఇన్వతి 4,000 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీహార్‌లో జేడీ(యూ)కి చెందిన కళాధర్ ప్రసాద్ మండల్ రూపాలీలో ఆధిక్యంలో ఉండగా, తమిళనాడులోని విక్రవాండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ 10,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement