Friday, November 22, 2024

Elections – ఫేక్ వీడియోలు కాంగ్రెస్ సృష్టే … అమిత్ షా

మ‌రి కొన్ని అరెస్ట్ లుంటాయి
ఇప్ప‌టికే ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల‌కు నోటీసులు
రిజ‌ర్వేష‌న్ లు తొల‌గించే స‌మ‌స్యే లేదు
గౌహ‌తి మీడియా స‌మావేశంలో అమిత్ షా స్ప‌ష్టం

గౌహ‌తి – రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న మాటలు నిరాధారమని అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని మండి ప‌డ్డ్డారు.. త‌న ప్ర‌సంగాన్ని మార్ఫింగ్ చేసి ట్రోల్ చేసిన ఎవ‌ర్ని వ‌దిలే స‌మ‌స్య లేద‌న్నారు.. ఇప్ప‌టికే ఒక‌రిని అరెస్ట్ చేశామ‌ని, మ‌రికొంత మందికి నోటీసులు పోలీసు ఇచ్చార‌ని తెలిపారు.. గౌహ‌తి లో నేడు ఆయ‌న మీడియాతో మాడ్లాడుతూ, ఇప్ప‌టికే సంబంధిత సోష‌ల్ మీడియా వేదిక‌ల‌కు నోటిస్ లిచ్చామ‌ని, వారి నుంచి మ‌రికొన్ని వివ‌రాలు వ‌చ్చిన త‌ర్వాత మ‌రిన్ని ఆరెస్ట్ లు త‌ధ్య‌మ‌న్నారు…

ఇక రెండు దశల పోలింగ్ తర్వాత, త‌మ‌ పార్టీ అంతర్గత అంచనా ప్రకారం.. బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి 100 స్థానాలను దక్కించుకున్నట్లు తెలుస్తుందన్నారు. ప్రజల ఆశీస్సులతో 400 సీట్లు దాటాలనే మా లక్ష్యం వైపు దూసుకుపోతున్నట్లు కేంద్ర అమిత్ షా వెల్లడించారు.

- Advertisement -

ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లు ఉండటానికి బీజేపీ ఎప్పుడు మద్దతు ఇస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం చేసిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు.. దాని కారణంగా ఓబిసి రిజర్వేషన్లు తగ్గాయ‌న్నారు. . ఆ తర్వాత కర్ణాటకలో రాత్రికి రాత్రే ఎలాంటి సర్వే లేకుండానే ముస్లింలందరినీ ఓబీసీ కేటగిరీలో పెట్టి వారికి 4 శాతం రిజర్వేషన్ కోటాను కేటాయించడం వల్ల వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లలో కూడా కోత ప‌డింద‌న్నారు. ..

అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ మొదలైన అన్ని రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విజయం సాధిస్తున్నామని అమిత్ షా అన్నారు. దీంతో పాటు సౌత్ ఇండియాలో కూడా బీజేపీకి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement