రాంచీ: జార్ఖండ్‌లో ఇండియా కూటమి అధీక్యంలో కొనసాగుతున్నది.. ముందు వచ్చిన ట్రెండింగ్ లో జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. అయితే ఆ తర్వాత ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 చోట్ల లీడ్‌లో ఉన్నది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇండియా కూటమి 50 స్థానాలలలో అధీక్యం ఉండగా , ఎన్డీఎ కూటమి 29 స్థానాలకే పరిమితమైంది.. మరో రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్ధులు లీడ్ లో ఉన్నారు. ఇక్కడ అధికార పీఠం దక్కాలంటే 41 స్థానాలు గెలువాల్సి ఉంది. ఆ ఫిగర్ ను ఇండియా కూటమి దాటేసింది.
రాష్ట్రంలో ప్రస్తుతం జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలో ఉన్నది. ప్రస్తత ఎన్నికల్లో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి.