Tuesday, November 26, 2024

టీఆర్ఎస్‌, బీజేపీల ఎన్నిక‌ల హామీలు ఎక్క‌డా అమ‌లు కాలే : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ఎన్నిక‌లు వ‌చ్చినప్పుడే హామీలు గుప్పించ‌డం టీఆర్ఎస్‌, బీజేపీలు అల‌వాటుగా మార్చుకున్నాయ‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామ‌ని చెప్పుకోవ‌డం త‌ప్పా చేసిందేమీ లేద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చారో చెప్పాలని బీజేపీ నేతలను ఆయన ప్రశ్నించారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల సంగతేంటని టీఆర్ఎస్ నేతలను నిలదీశారు. తమ నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులకు సంబంధించి లెక్కలు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ లను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక రావ‌డంతో మ‌ళ్లీ పాత క‌థే మొద‌లు పెట్టార‌ని.. హామీల‌తో మునుగోడునే ముంచే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. బీజేపీ, టీఆర్ఎస్ హామీల‌ను, ఆ పార్టీల నేత‌ల‌ను నమ్మొద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతినే గెలిపించాలని ప్రజలను కోరారు. ఓటమి రుచి చూస్తేనే టీఆర్ఎస్, బీజేపీలు తమ హామీలను అమలు చేస్తాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement