కామారెడ్డి .. తెలంగాణలోని ఒక్క సమస్యనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఏ ముఖం పెట్టుకుని కామారెడ్డిలో ఎలా ఓట్లు అడుగుతారని, మన సమస్యల్ని కనీసం పట్టించుకోని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఓటు వేయొద్దని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు పిలుపు నిచ్చారు. గురువారం నామినేషన్ అనంతరం కామారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డిలో బీఆర్ఎస్ శ్రేణులు పరవళ్లు తొక్కారు. అశేష ప్రజానీకం కేసీఆర్ సభలో అశేష ప్రజానీకం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ర్టంలో 24 గంటల కరెంటు లేదు, తెలంగాణ బతుకు తెరువు వ్యవసాయం. వ్యసాయానికి ఆధారం బోర్లు. బోర్లకు కరెంటు మీటర్లు పెట్టాలని నరేంద్ర మోడీ ఎంత మొత్తుకున్నా ఒప్పుకోలేదు. తెలంగాణ మీద కక్షతో రూ.25,000 కోట్లు ఆదాయం కట్ చేశారు. ఇక బీజేపీ ఏ ముఖ్య పెట్టుకుని ఓట్లు అడుగుతుంది? దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక నవోదయ స్కూలు పెట్టాలి. తెలంగాణ జిల్లాలో 33 జిల్లాలు వచ్చాయి. 100 సార్లు ప్రధాన మంత్రికి లేఖలు రాసినా పట్టించుకోలేదు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. తెలంగాణకు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని .. బీ.జేపీకి ఒక్క ఓటూ వెయ్యొద్దు, ఓటు వేస్తే మనల్ని బేవకూఫ్లా చూస్తారని తెలంగాణపై పగ పట్టిన బీజేపీకి ఒక్కటంటే ఒక్క ఓటూ వెయ్యొద్దు అని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.
ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి సరేసరి. రైతు బంధు వద్దంట, 24 గంటల కరెంటు తీసేస్తారంట, ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తారట. ఇవ్వనీ వద్దనే కాంగ్రెస్ పార్టీ కావాలా? తెలంగాణ బతుకు కోసం పని చేసే బీఆర్ఎస్ కావాలా? ఆలోచించండి అని ప్రజలను కేసీఆర్ కోరారు. దేశంలోని 16 రాష్ర్టాల్లో బీడీ కార్మికులు ఉంటే, తెలంగాణలో తప్పా ఏ రాష్ర్టంలోనూ బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వటం లేదని కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కొత్త బీడీ కార్మికులకూ పెన్షన్ ఇస్తామన్నారు. అందరితో సమానంగా రూ.5వేల పెన్షన్ మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే అయిదేళ్లల్లో తెలంగాణ మంచి మేలు జరుగుతుంది, ఆగం ఆగంగా, గడ బిడ గడ బిడగా ఓట్లు వేయొద్దు. ఒక్కసారి ఆలోచించండి. 50 లక్షల నగదు దొరికినోడిని తీసుకువచ్చి కామారెడ్డిలో నా మీద పోటీ పెట్టారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రజల బాగోగులు కోసం పని చేసే పార్టీ ఏది? మాయ మాటల పార్టీ ఏదీ? గుర్తించండి. అని కేసీఆర్ వివరించారు.