తెలంగాణలో పలు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గతంలోనే ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. మరోవైపు ఈటెల రాజేందర్ రాజీనామా కారణంగా హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందా అన్న అంశాలపై సీఎస్ సోమేష్ కుమార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అయితే లేఖలో హుజురాబాద్ ఉపఎన్నిక ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
కాగా తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్సీలుగా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, మహమ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం ఇప్పటికే ముగిసింది. అయితే కొత్త ఎమ్మెల్సీ ఎన్నిక అయ్యే లోపే కరోనా పరిస్థితులు చేయి దాటేలా ఉండటంతో సీఈసీ ఎన్నికలను వాయిదా వేసింది. ఇవన్నీ ఎమ్మెల్యే కోటా ఎన్నికలే కావటంతో అన్నీ అధికార టీఆర్ఎస్ పార్టీకే దక్కనున్నాయి. ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్త కూడా చదవండి: జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ పథకం మార్గదర్శకాలు విడుదల