Friday, November 22, 2024

AP | అచ్చెన్నాయుడుకి ఎన్నికల సంఘం నోటీసులు..

అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా సీఎం జగన్‌పై ఇద్దరు నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో కోడ్ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని కోరుతూ అచ్చెన్నాయుడులకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement