తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జనసేన పార్టీ గుర్తును ఎన్నికల కమిషన్ వేరే పార్టీకి కేటాయించడంతో బీజేపీకి పరేషాన్ మొదలైంది. దీంతో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో గాజుగ్లాసు గుర్తు వివాదం రేగుతోంది. గాజు గ్లాస్ గుర్తును నవతరం పార్టీకి ఈసీ కేటాయించడంతో జనసేన ఓట్లు క్రాస్ అవుతాయని బీజేపీ ఆందోళన చెందుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తగినన్ని సీట్లు రాకపోవడంతో జనసేన పార్టీకి ఇంకా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ హోదా ఇవ్వలేదు. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్‌కు జనసేన గుర్తు గాజు గ్లాస్‌ను కేటాయించారు. తిరుపతి ఉపఎన్నికల్లో పవన్ ప్రచారంతో తమ పార్టీకి ఊపు వచ్చిందని అనుకుంటున్న బీజేపీకి ఈ వార్త షాకిచ్చింది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తును మరో పార్టీకి ఎన్నికల గుర్తుగా కేటాయించడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా జనసేన అధ్యక్షుడు పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున తమ పార్టీ అభ్యర్ధికి గాజుగ్లాసు గుర్తు కేటాయించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వివరణ ఇచ్చారు.