సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాల రిలీజ్ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తిరుమలలో దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించరాదని నిర్ణయించింది.
టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్ణయం మేరకు శనివారం నుంచి తిరుమలలో ఎమ్మెల్యే, ఎంపీ రికమండేషన్ లేటర్‌లను పరిగణలోకి తీసుకోకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రజా ప్రతినిధులు గౌరవించాలని, తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం స్వయంగా వచ్చే ప్రముఖులకు శ్రీవారి దర్శనం, వసతిని పరిగణనలోకి తీసుకోనున్నారు.