దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో తెలంగాణలో ధరణి స్పెషల్ డ్రైవ్‌ను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెమో జారీ చేసింది. ధరణి దరఖాస్తుల నిలిపివేతకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తొలుత ధరణి డ్రైవ్‌ని మార్చి 17 వరకు కొనసాగించాలని భావించింది. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయింది. ధరణి స్పెషల్ డ్రైవ్ లేనప్పటికీ, ధరణి సమస్యలకు సంబంధించిన సాధారణ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement