Friday, November 22, 2024

Election Campaign – వాళ్లు క‌మీష‌న్ల కోసం… మేం మిష‌న్ కోసం – ఇండియా కూట‌మిపై మోదీ ఫైర్


బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే మిషన్(లక్ష్యం) కోసం పనిచేస్తుంటే, ఇండియా కూటమి కమీషన్ సంపాదించడానికి ప్రయత్నిస్తోందని పీఎం మోదీ ఆరోపించారు. బీజేపీకి 370 కంటే ఎక్కువ సీట్లు రాకుండా ప్రయత్నించేందుకు ప్రతిపక్ష కూటమి పోరాడుతోందని ఆయన అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోడీ నేడు సహరాన్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. సమాజ్‌వాదీ(ఎస్పీ) ప్రతీ గంటకు అభ్యర్థిని మారుస్తోందని, కాంగ్రెస్‌కి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదని ప్రధాని అన్నారు. చివరకు తమ కంచుకోటల్లా భావించే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని, అందులో కొంత భాగం వామపక్షాల ఆధిపత్యం కనిపిస్తోందని ప్రధాని విమర్శించారు. ఇండియా కూటమి అస్థిరత, అనిశ్చితికి పర్యాయపదంగా మారిందని, దేశ ప్రజలు వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రధాని అన్నారు. ”శక్తిని ఆరాధించడం మన సహజ ఆద్యాత్మిక ప్రయాణంలో భాగం, కానీ ఇండియా కూటమి ప్రజలు శక్తికి వ్యతిరేకంగా తమ పోరాటం అంటున్నారు” అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement