రాజ కుటుంబంలా దేశాన్ని దోచేశారు
కాంగ్రెస్ పెద్దలపై మోడీ విసుర్లు
హర్యానాలో అల్లుడు అరాచకాలు
అవినీతి, బంధుప్రీతికి కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్
రిజర్వేషన్ ల వ్యతిరేకత, ద్వేషం కాంగ్రెస్ డిఎన్ ఎ
హర్యాన ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పై మోడీ ఆగ్రహం
సోనేపట్ – హర్యానా – కాంగ్రెస్ దేశంలోనే అత్యంత అవినీతి కుటుంబమని విరుచుకుపడ్డారు ప్రధాని మోడీ. 10 ఏళ్ల క్రితం హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసు అన్నారు. ఇక్కడ రైతుల భూములు దోచుకున్నారని, , రాష్ట్రాన్ని దళారీలకు , అల్లుడులకు అప్పగించారని ఫైర్ అయ్యారు. హర్యానలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేడు గోహనా, సోనిపట్‌లో లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ఆశ్రిత పక్షపాతాన్ని పెంచుతోందని ఆరోపించారు. ప్రధాని తన ప్రసంగంలో రైతులు, దళితులు, కుటుంబ వాదాన్ని ప్రస్తావించారు.. హర్యానాలో ఓటింగ్ రోజు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీకి మద్దతు పెరుగుతోందని అన్నారు.
కాంగ్రెస్‌కు ఎక్కడ అవకాశం దొరికినా, ఎక్కడ అడుగు పెట్టినా అవినీతి, బంధుప్రీతి తప్పవని మీ అందరికీ తెలుసు. మన దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని సృష్టించి, పెంచి పోషిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని మోదీ ఆరోపించారు. రైతుల ప్రయోజనాల నిమిత్తం హర్యానాలోని బిజెపి ప్రభుత్వం రైతుల నుండి 24 పంటలను ఎంఎస్‌పికి కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తక్కువ ధరతో పంటలను కొనుగోలు చేయడాన్ని బీజేపీ అసహ్యించుకుందన్నారు. హర్యానాలో గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉందని అన్నారు. కానీ తమ ప్రభుత్వంపైనా, మన ముఖ్యమంత్రిపైనా ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు.
రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో హర్యానా నేడు వ్యవసాయం, పరిశ్రమల పరంగా దేశంలోని అగ్ర రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ రాజకుటుంబం నుండి దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు వచ్చినా రిజర్వేషన్లను ఎప్పుడూ వ్యతిరేకించారని అన్నారు. రిజర్వేషన్ వ్యతిరేకత, రిజర్వేషన్ ద్వేషం ఇవన్నీ కాంగ్రెస్ డీఎన్ ఏలోనే ఉన్నాయి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీల భాగస్వామ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ దూరం చేసిందన్నారు. దళితులకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక నాయకుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని, లేకుంటే ఓబీసీ మాదిరిగానే దళితులు కూడా రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ ఓటమికి ఎదురుచూడాల్సి వచ్చేదన్నారు. ఈ ఎన్నికలలో బిజెపి విజయం సాధించడం తధ్యమని అన్నారు మోడీ.