Tuesday, November 19, 2024

ఎన్నికల ఏర్పాట్లు షురూ.. ఈవీఎంల పరిశీలన ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎన్నికల సంఘం తెలంగాణలో రాష్ట్ర శాసనసభ ఎన్నికల దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవీఎంల పరిశీలన ప్రారంభించింది. ఉన్నతాధికారులనుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు శిక్షణకు షెడ్యూల్‌ను నిర్దేశించుకున్నది. ఈ మేరకు శుక్రవారంనాడు తొలి దశ ఈవీఎంల చెకింగ్‌ వర్క్‌షాప్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ ప్రారంభించారు. 33 జిల్లాలకు చెందిన జిల్లా ఎన్నికల అధికారులు, డిప్యుటీ ఎన్నికల అధికారులులకు ఈవీఎంల తొలిదశ పరిశీలన శిక్షణా సదస్సు డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల ఆధ్వర్యంలో జరిగిన శిఓనా శిబిరంలో ఈవీఎంల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

త్రిపుర, ఏపీ, అండమాన్‌, డామన్‌, డయ్యూ, దాద్రానగర్‌ హవేలీలకు చెందిన అధికారులతో ఈసీఐఎల్‌ ఇంజనీర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఏప్రిల్‌ 9నుంచి 11ల వరకు జరిగిన జాతీయ సదస్సులో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ సదస్సును నిర్వహించారు. ఆ దస్సులో నిర్ణయించినట్లుగా తెలంగాణలో ఎన్నికల నిర్వహన ఏర్పాట్లను ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 14న పీనియర్‌ డిప్యుటీ ఎన్నికల కమిషనర్‌ తెలంగాణలో పర్యటించారు. ఆయన సూచనల మేరకు ఈ ఎన్నికల్లో ఈవీఎంల సన్నద్ధత, పరిశీలనను ప్రారంభించారు. తుది ఓటర్ల జాబితా అక్టోబర్‌ 4న విడుదల చేసేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement