Friday, November 22, 2024

చెత్త = శ‌క్తి….

జీహెచ్‌ఎంసీ అడుగులు
ట్రీట్‌మెంట్‌ డిస్పోజల్‌ తరహాలో వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు
హైదరాబాద్‌ నలువైపులా వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం
100మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం
చెత్తతో సంపద సృష్టికి శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) నగరంలో చెత్త నిల్వల నుంచి సంపద సృష్టించేలా చర్యలు చేపట్టి సత్ఫలితాలను రాబడుతోంది. నగరంలో రోజు వారీగా సేకరిస్తున్న చెత్తను నిల్వ ఉంచకుండా ట్రీట్‌మెంట్‌ డిస్పోజల్‌ తరహాలో వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు-కు జీహెచ్‌ఎంసీ కృషి చేస్తోంది… జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ.. చుట్టుపక్కల నగర పాలక సంస్థల్లోనూ సేకరిస్తున్న వ్యర్థాల మొత్తాన్ని ఎప్పటికప్పుడు నిల్వ ఉండకుండా డిస్పోజల్‌ చేసే వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్ల తయారీకి బల్దియా మొగ్గు చూపుతోంది…

గ్రేటర్‌ హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: జీహెచ్‌ఎంసీ, ఇతర నగర పాలక సంస్థల నుండి సేకరిస్తున్న రోజువారి వ్యర్థా లు ప్రతిరోజు సుమారు 7000 నుంచి 7500 మెట్రిక్‌ టన్ను లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సేకరిస్తున్న చెత్తను నిల్వ ఉంచడం పెనుసవాల్‌గా మారుతోం ది. గతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్తతో సమ స్యలను ఎదుర్కొన్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వ చర్యలతో ఉపశమనం లభిస్తోంది. ఈ నేపథ్యంలో సేకరించిన చెత్తను నిల్వ ఉంచకుండా ట్రీట్‌మెంట్‌ డిస్పోజల్‌ చేసే పక్రియకు ఎక్కు వ అధికారులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. తడి చెత్తను కంపోస్టు ఎరువుగా మార్చడం, బయోగ్యాస్‌ తయారు చేయ డం, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేయడం, పొడి చెత్తలో మండే గుణం గల వ్యర్థాలను పోగు చేసి విద్యుత్‌ తయారీకి వినియోగిస్తున్నారు. తద్వారా చెత్తతో సంపద సృష్టించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటికే జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన 19.5 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను 24 మెగావాట్ల కెపాసిటీకి పెంచారు. ఆ తర్వాత మరో 24 మెగావాట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో జవహర్‌నగర్‌లో మొత్తం 48 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా మరో ప్లాంట్‌ సిద్ధమవు తోంది. ప్లాంట్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పాత 19.8 మెగావాట్ల ప్లాంట్‌ కోసం రోజుకు సుమారు 1300 టన్నుల నుండి 1500 టన్నుల వ్యర్థాలు(ఆర్డీఎఫ్‌) ఉపయో గించుకుంటు-న్నారు. ఇప్పటి వరకు 6.35 లక్షల ఆర్డీఎఫ్‌ (రెఫ్యూస్‌ డెరివుడ్‌ ఫ్యూయల్‌)ను వినియోగించుకొని 225 మెగా యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు.

- Advertisement -

చెత్తతో సంపద సృష్టి
చెత్తతో సంపద సృష్టించాలన్న ఉద్దేశంతో వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. సేకరించిన చెత్తను నిల్వ ఉంచుకోకుండా వెనువెంటనే మొత్తాన్ని వినియోగించుకోవాలన్నది జీహెచ్‌ఎంసీ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చెత్తతో సంపదను సృష్టించేందుకు నగరం నలువైపులా వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు- చేసేందుకు జీహెచ్‌ఎంసీ అన్ని చర్యలు తీసుకుం టోంది. దుండిగల్‌లో మరో 14.5 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టడం జరిగింది. అది మార్చి నెల చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ ప్లాంట్‌ గనుక ఉత్పత్తి ఆరంభించిన నేపథ్యంలో మరో 1000 నుండి 1200 మెట్రిక్‌ టన్నుల చెత్త అవసరం ఉంటు-ంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌లో జీహెచ్‌ఎంసీ ద్వారా 15మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఉత్తర ప్రాంతం నుండి సేకరించిన చెత్త ప్యారానగర్‌ తరలించి విద్యుత్‌ తయారీకి రోజుకు సుమారు 800 నుండి 1000 టన్నుల ఆర్డీఎఫ్‌ని వినియోగించుకోనున్నారు. బీబీ నగర్‌లో 11 మెగావాట్ల వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయింది. కానీ ఆ కంపెనీ యాజమాన్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో, వేరే సంస్థ ఆధ్వర్యంలో ఆ ప్లాంట్‌ పునరుద్ధ రణకు చర్యలు చేపట్టారు. అది త్వరలో అందుబాటు-లోకి రానున్నది. ఈ ప్లాంట్‌ మూలంగా 800 నుండి 900 టన్నుల వరకు చెత్తను విని యోగించుకునే వెసులు బాటు- ఉంటు-ంది. ఇబ్రహీంపట్నం మండలంలోని యాచారంలో 12 మెగావాట్ల వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టారు. అయితే 12 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌ను 14 మెగావాట్లకు కెపాసిటీ- పెంచనున్నారు. అందుకు ప్రభుత్వ అనుమతి కూడా త్వరలో రానున్నది.
గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు- చుట్టూ ఉన్న నగరపాలక సంస్థల్లో జనాభా పెరగడమే కాకుండా దినదినాభివృద్ధి, విస్తర ణ జరుగుతున్న క్రమంలో వ్యర్థాలు కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టు-గా వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాం ట్లను ఏర్పాటు- చేసి రోజు వారీగా సేకరించిన చెత్తనంతటిని నిల్వ ఉంచకుండా ట్రీ-ట్‌మెంట్‌, డిస్పోసల్‌ ద్వారా మొత్తం చెత్త ను వినియోగించాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదే శాల మేరకు జీహెచ్‌ఎంసీ ముందుకు సాగుతోంది. ఈ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా మొత్తం 100.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement