ఈ నెల 13న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యవసాయం, పల్లె, పట్టణ ప్రగతితో పాటు తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో సినిమా థియేటర్ల ఓపెనింగ్ వంటి అంశాలపై చర్చ ఉండే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీతో జరుగుతున్న జల వివాదంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కరోనా థర్ద్ వేవ్ పై కూడా సర్కార్ దృష్టి సారించింది. కరోనా మూడో దశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వపరంగా జాగ్రత్తలు, సన్నద్ధతపై మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.
ఈ వార్త కూడా చదవండి: రేపు వాసాలమర్రికి సీఎం కేసీఆర్