Friday, November 22, 2024

ఎల్‌-నినో ఎఫెక్ట్‌.. ఫలితంగా మధ్యామ్నం మండుటెండలు, రాత్రి వేళల్లో చలి తీవ్రత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. తెలంగాణలో క్రమంగా చలి తగ్గి వేడి పెరుగుతోంది. రాత్రి పూట చలి విషయంలో నేడు 3 జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ అయింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఉంది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్‌ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్‌ బులెటిన్లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్‌ జారీ చేయలేదు.

తెలంగాణాలో..

- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పొడి గాలులు వీస్తాయి. హైదరాబాద్‌ నగరంలో ఉదయం వేళల్లో పొగ మంచు ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 33.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.4 డిగ్రీలుగా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌లో..

ఆంధ్రప్రదేశ్‌, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్‌ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటు-ంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులపాటు పొడి వాతావరణమే ఉంటుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.

ఎల్‌-నినో ఏర్పడే అవకాశాలు

రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఎల్‌-నినో ఏర్పడే అవకాశాలు ఈ ఏడాది కనిపిస్తున్నాయి కాబట్టి రానున్న మూడు నెలల్లో ఎండల వేడి బాగా ఎక్కువ ఉండనుంది. పసిఫిక్‌ మహా సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లా-నినా ఇప్పుడు బాగా బలహీనపడింది. దీని ప్రభావం మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. మార్చి నుంచి మే నెలలో మనకు ఎండలు బాగానే కాస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement