Friday, November 22, 2024

ఇండియాలో త్వరలో 8 కొత్త బ్యాంకులు

దేశంలో మరికొన్ని కొత్త బ్యాంకులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో పెద్ద, చిన్న బ్యాంకులు ఉన్నాయి. ఈ విషయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్వయంగా వెల్లడించింది. పెద్ద, చిన్న బ్యాంకుల కోసం ఎనిమిది దరఖాస్తులు వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది. యూనివర్సల్‌ బ్యాకింగ్‌‌ లైసెన్స్‌ కోసం యూఏఈ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, రిపాట్రియేట్‌ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (రెప్కో బ్యాంక్‌), చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, పంకజ్ వైశ్య దరఖాస్తులు చేశాయి. చిన్న ఫైనాన్స్‌ బ్యాంకుల (ఎస్‌ఎఫ్‌బీ) కోసం విసాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాలికట్ సిటీ సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అఖిల్ కుమార్ గుప్తా, ద్వార క్షత్రియ గ్రామీణ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభించేందుకు దరఖాస్తులు చేసుకున్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. కాగా బ్యాంకుల ఏర్పాటుకు ఆయా దరఖాస్తులను సమీక్షించేందుకు ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామల గోపీనాథ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement