హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రెసిషన్ ఫార్మింగ్ చేపట్టడం వలన రసాయనిక ఎరువుల సమర్ధ వినియోగం జరుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు అన్నారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లోని నీటి సాంకేతిక పరిజ్ఞానం కేంద్రంలో సుస్థిర భూసార ఆరోగ్య పరిరక్షణకు ఫర్టిగేషన్ అనే అంశంపై ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అగ్రి యూనివర్సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రవీణ్ రావు మాట్లాడారు..
పంటల మార్పిడి ద్వారా కూడా రసాయనిక ఎరువులని సమర్థవంతంగా వినియోగించవచ్చని అన్నారు. ఫర్టిగేషన్ విధానం వలన పంటలు వివిధ దశలలో ఉన్నప్పుడు అవసరమైన మేరకు మాత్రమే రసాయనిక ఎరువులని సరైన మోతాదులో వాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంలో నవ కల్పనలతో రైతులకు మేలైన సేవలు అందించడానికి కృషి చేయాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.