Friday, November 22, 2024

సమర్థవంతంగా ఆరోగ్యశ్రీ అమలు.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ డోలా బాల వీరాంజనేస్వామి తదితరులు ఆయుస్మాన్‌ భారత్‌ యోజన పథకంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిసూ,్త గతంలో ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. అప్పట్లో పేదలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి చలించిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారన్నారు. ఈ పథకం ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఆయుస్మాన్‌ భారత్‌ యోజన పథకాన్ని తీసుకొచ్చిందని ఆమె చెప్పారు.

వైఎస్‌ హయాంలో 940 ప్రొసీజర్లు పెట్టగా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదన్నారు. వైఎస్‌ జగన్మోహన రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,446 ప్రొసీజర్లకు చేర్చామని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 55లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తున్నట్లు మంత్రి రజని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆయుస్మాన్‌ భారత్‌ యోజన పథకం కింద ఇప్పటి వరకు 1,514.75 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement