ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా, డెల్టా ప్లస్ సహా తొలి వేరియంట్లకన్నా బలహీనమైనదేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దక్షిణాఫ్రికాకు చెందిన పరిశోధకులు, వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా వేరియంట్ కేసుల వ్యాప్తి వేగంగాను, ఎక్కువగానూ ఉన్నప్పటికీ, తొలి వేరియంట్లతో పోలిస్తే దీని లక్షణాలు స్వల్ప ప్రభావమే చూపిస్తున్నాయని పేర్కొన్నారు. అప్పటిలా కరోనా సోకిన వారికి ఆక్సిజన్, ప్లాస్మా థెరపీవంటివి అవసరం రాలేదని స్పష్టం చేశారు.
తొలి మూడు తరంగాల్లో రోగుల్లో కన్పించిన లక్షణాలతో పోలిస్తే ఒమిక్రాన్ బాధితుల్లో ఆ స్థాయిలో తీవ్ర సమస్యలేమీ కన్పించలేదని నెట్ కేర్ సంస్థ సీఈఓ రిచర్జ్ ఫ్రైడ్ లాండ్ వెల్లడించారు. దేశంలో పేరుగాంచిన మరో రెండు ప్రైవేటు వైద్య, ఆరోగ్య వ్యవస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఒమిక్రాన్ సోకిన వృద్ధుల్లో ఒకరూ ఇద్దరు తప్ప మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉందని, వ్యాక్సిన్ తీసుకోనివారిలోనే వైరస్ సోకుతోందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital