మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 19 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ‘ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి, 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు జూలై 19 నుండి శ్రీకారం చుడుతున్నాను’ అని ఆయన చెప్పారు.
‘ఉదయం 7:30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభం అయ్యే ఈ ప్రజా పాదయాత్రకి మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా అడుగులకు మీ అండదండలు కావాలి. నా ప్రస్థానానికి మీ ప్రేమాభిమానాలు కావాలి. ప్రజా దీవెన యాత్రకి మీ అందరి దీవెనలు కావాలి. ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు’ అని ఈటెల రాజేందర్ ప్రకటించారు. కాగా, హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే.
ఈ వార్త కూడా చదవండి: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు