Saturday, November 23, 2024

స్వరాష్ట్రంలో విద్యావికాసం…

స్వరాష్ట్రంలో విద్యరంగం వికసించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలను కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తిగడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 978 గురుకుల పాఠశాలలో 5 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనను అందిస్తున్నారు. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి రూ.1లక్షా 25 వేలను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. అన్ని రకాల విద్యాలయాల్లో, హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతూ ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందజేస్తున్నది. ఈ ఏడాదిలో ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకం విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చనున్నది. రాష్ట్రంలోని పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.7,289 కోట్లు కేటాయించింది.

మోడల్‌ స్కూళ్లను అభివృద్ధి చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియంలో బోధనను ప్రవేశపెట్టబోతున్నారు. ఆంగ్ల మాద్యమంలో భోధించే ఉపాధ్యాయులు ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని పెంపొందిచడానికి అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్విద్యాలయం(ఏపీయు) సహకారంతో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల అందరికోసం ఎస్‌ఈఆర్‌టీ, ఏపీయుల 9 వారాల ఆంగ్ల భాషా ఎన్‌రిచ్‌మెంట్‌ కోర్సును సైతం రూపొందించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2015-16 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత విద్యను ప్రవేశపెట్టి, ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నారు. దీని కారణంగా గత 5 సంవత్సరాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా 30 శాతం పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement