తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీలో కూరగాయలు అమ్ముతున్న బాలుడిని గుర్తించిన సబితా రెడ్డి ఆ పిల్లాడు పాఠశాలకు వెళ్లేలా చూడాలని బాలుడి తండ్రితో మాట్లాడారు. తుక్కుగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం బాలుడిని చూసిన మంత్రి ఆ పిల్లాడితో ముచ్చటించి స్కూల్ కు ఎందుకు పోలేదు అని ఆరా తీసారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ భవిష్యత్తు బాగుండాలంటే విద్య విలువను తెలుసుకోవాలని మంత్రి పిల్లలకు సూచించారు. చదువుకుంటేనే మున్మందు మంచిగా ఉంటారని, చిన్న చిన్న పనులు చేసుకునే అవసరం ఉండదని సూచించారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..