Friday, November 22, 2024

Editorial – పుతిన్ స్వ‌యంకృతం…

ఒకనాడు అగ్రరాజ్యంగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన రష్యా ఈనాడు కిరాయి సైన్యం బెదిరింపులకు గురి కావడం విధివిలాసమే. యూఎస్‌ఎస్‌ఆర్‌ చీలికలు పేలికలుగా విడిపోయిన తరువాత… కోలుకుని మళ్లి పూర్వవైభవం కోసం పయత్నిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వేసిన తప్పటడుగులు ఈ దీనస్థితికి కారణం. ఇది ఎవరో బయటివారివల్ల వాటిల్లిన పరిస్థితి కాదు, ముమ్మాటికీ స్వయంకృతమే. తానే ఏర్పాటు చేసుకున్న కిరాయి సైన్యం తిరగబడటం రష్యా ఎంత బలహీనపడిం దో చెప్పకచెబుతుంది. సోవియట్‌ యూనియన్‌ను ఉద్దేశించి అప్పట్లో గాండ్రించు రష్యా అన్నారు మహాకవి శ్రీశ్రీ. అంటే అంత శక్తిమంతమైన దేశమని అర్థం. అయితే ఇప్పుడు గాండ్రించడం సంగతి ఎలా ఉన్నా… గట్టిగా మాట్లాడే పరిస్థితే లేదు. వాస్తవానికి ఇప్పటికీ రష్యా ఆయుధ, అణు సామర్థ్యాలేవీ చెక్కు చెదరలేదు.

కానీ, పాలకుల చంచల స్వభావం, దుర్నీతి, తప్పుడు వ్యూహాల కారణంగా రష్యా ప్రతిష్ట మసకబారింది. అమెరికాని నిలువరించే శక్తి ఇప్పటికీ కలిగిఉన్నా.. తాజా పరిణామా లు క్రెవ్లిున్‌ సమర్థతపై సందేహాలు లేవనెత్తాయి. అగ్రరాజ్యం అమెరికాతో ఢీ అంటే ఢీ అంటూ ప్రచ్ఛన్న యుద్ధానికి దిగిన రష్యా రక్షణ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించింది. వర్థమా న దేశాలకు అండగా ఉంటుందనే పేరు సంపాదించు కుంది. అయితే, రష్యా అధ్యక్షునిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. పుతిన్‌ గతంలో రష్యన్‌ రహస్య గూఢచార సంస్థ కేజీబీలో ఏజెంట్‌గా జీవితాన్ని ప్రారం భించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సీక్రెట్‌ ఏజెంట్‌ సర్వీసు (సీఐఏ)కి దీటుగా ఎదిగిన యునైటెడ్‌ సోవియ ట్‌ సోషలిస్టు రష్యా (యూఎస్‌ఎస్‌ఆర్‌)లో కేజీబీకి ఎంతో పేరు ఉండేది. ఆ సంస్థలో అంచలంచెలుగా ఎదిగిన పుతిన్‌ సహజంగానే ప్రతి అంశాన్నీ నేరపరిశోధనా దృష్టితో పరిశీలించడం అలవాటు చేసుకున్నారు.

అత్యున్నతమైన అధ్యక్ష పదవీ బాధ్యతలను చేపట్టి కిరాయి సైన్యాన్ని పెంచి పోషించారు. ఇప్పుడు ఆ కిరాయి సైన్యమే ఆయనకు ఎదురు తిరిగింది. పుతిన్‌ తయారు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అత్యంత శక్తిమంతమైనది. దాని శక్తి సామర్థ్యాలను గురించి ఉక్రెయిన్‌ యుద్ధంలో బఖ్ముత్‌ నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు యావత్‌ ప్రపంచానికి తెలిసింది. ఒక కిరాయి సైనికుడు పదిమంది రష్యన్‌ సైనికుల పెట్టుగా చెబుతారు. పాముకు పాలు పోస్తే వారిని అదే చివరికి కాటు వేస్తుందన్న సామెత వాగ్నర్‌ సైన్యాన్ని పెంచి పోషించిన పుతిన్‌కి అనుభవంలోకి వచ్చింది. ఆ సైన్యమే ఎదురు తిరిగే పరిస్థితి రావడం ముమ్మాటికీ స్వయంకృతమే. ఉక్రెయిన్‌లోని బఖ్ముత్‌ని ధ్వంసం చేయడంలో ప్రిగోజిన్‌ నేతృత్వంలోని కిరాయి సైన్యం ఎంతో కిరాతకంగా వ్యవహరించింది. వారి చర్యలు ఎంతటి అమానుషమైనవైనా పుతిన్‌ ఎంతో సంతోషిం చారు. ఇప్పుడు తనదాకా వస్తేగాని తెలియదన్న సామెత చందంగా ప్రిగోజిన్‌ తిరిగుబాటుకు గజగజ వణకి బంకర్లలో కాలం గడిపారు.

- Advertisement -

రష్యాకు పట్టిన గతిని చూసి పాశ్చాత్య దేశాలు తెగ సంబరపడ్డాయి. అయితే, పుతిన్‌ కు అత్యంత మిత్రదేశం బెలారస్‌ మధ్యవర్తిత్వం, రష్యా రక్షణ మంత్రి ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంవల్ల ప్రిగోజిన్‌ తిరుగుబాటు విఫలమైంది. చైనా, ఉ.కొరియా తెరవెనుక కథ నడిపాయి. తిరుగుబాటుకు ఇది సమయం కాదని నిర్ణయానికి వచ్చిన ప్రిగోజిన్‌ వెనక్కి తగ్గారు. నిజానికి తిరుగుబాటుకు ప్రయత్నిం చినందుకు అతడు రష్యన్‌ జైళ్ళల్లో మగ్గవల్సిన పరిస్థితి. అయితే, పుతిన్‌కి అత్యంత సన్నిహితుడైన బెలూరస్‌ అధ్యక్షుడు లుకషెంకో ఆశ్రయం ఇవ్వడంతో బతికిపోయాడు. కానీ, ఉక్రెయిన్‌పై దాడి సమయంలో తమ దేశ అవసరాల కోసం బెలారస్‌లో పుతిన్‌ క్షిపణులనూ, అణ్వస్త్రాలతో సహా అత్యంత కీలకమైన ఆయుధాలను ఉంచాడు. కిరాయి సైనికులు పుతిన్‌పై తిరుగుబాటు చేస్తే పాశ్చాత్య దేశాలు దీనిని ఒక అవకాశంగా తీసుకుని విరుచుకుని పడే ప్రమాదం ఉందని గ్రహించి లుకషెంకో పుతిన్‌కి అండగా నిలిచారు. కిరాయి సైన్యం దాడి నుంచి పుతిన్‌ తప్పించుకోగలిగినా ఆ సైన్యం ముందుకు దూసుకుని రావడం వల్ల పుతిన్‌ సైన్యం బలహీనతలు బయటపడ్డా యి. ఇది పుతిన్‌ని నైతికంగా దెబ్బతీసిందనే చెప్పవచ్చు. తమ దేశంలో, తమ సైన్యం చేతులలోఉండాల్సిన శక్తిమంతమైన ఆయుధాలు పరాయి దేశానికి ఇచ్చి పుతిన్‌ స్వీయ రక్షణ కోసం గిలగిలలాడటం అవమానక రమే. ఉక్రెయిన్‌ యుద్ధంవల్ల ఇప్పటికే పుతిన్‌ బలహీనమ య్యారు. ప్రపంచ దేశాలలో అప్రదిష్ట మూటగట్టుకున్నా రు. ఆయన ఆరోగ్యంపై రోజుకో వార్త వస్తోంది. ఉక్రెయిన్‌ పై దండయాత్ర తరువాత కిరాయి సేనలకోసం ఆరువేల కోట్ల పైగా డాలర్లను ఖర్చు చేయాల్సి వచ్చిందని స్వయం గా చెప్పుకున్నాడు. ఇది కూడా రష్యా బలహీనతను బయటపెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement