Tuesday, November 19, 2024

Editorial – కొత్త చిక్కుల్లో ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారం లో ఉన్నప్పుడే కాకుండా, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా వివాదాలతో వార్తలకెక్కుతున్నారు. అయితే, తాను మళ్ళీ పోటీ చేయాలని నిర్ణయించుకోవ డంతో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి డెమోక్రాట్లు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆ యన ఎదురు దాడి చేస్తున్నారు. ట్రంప్‌ అధికారం నుంచి దిగిపోయేముందు పార్లమెంటు భవనంపై దాడికి తన అనుచరులను పురికొల్పినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఒక పాప్‌సింగర్‌ తోఆయన వ్యవహా రం గురించి వార్తలు వచ్చాయి. ఆయనపై ఆ శృంగార తార దావా వేసింది. ఆ గొడవ ఇంకా సద్దుమణగక ముందే ప్రభుత్వ రహస్య పత్రాలను తన అధీనంలో ఉంచుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఫెడరల్‌ విచారణ ప్రారంభమైంది.

వచ్చే మంగళవారం ఆయన మియామీలోని కోర్టులో విచారణకు హాజరు కావల్సి ఉంది. అధికార రహస్యాలను దాచిపెట్టిన కేసులో కోర్టుకు హాజరు కానున్న అమెరికా తొలి అధ్యక్షుడు ట్రంపే. ట్రంప్‌ అమెరికా అధ్యక్షులందరికన్నా వివాదాస్పదునిగా పేరొందారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. అప్పట్లో ఆయన నోటంట ఏ మాట వచ్చినా అది పెను వివాదాన్ని సృష్టించేది. ముఖ్యంగా తన ముందు అమెరికా అధ్యక్షునిగా వ్యవహరించిన బరాక్‌ ఒబామా పారిస్‌లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో భూతాపం సదస్సులో తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికాకి నష్టం కలిగిందని బహిరంగంగానే విమర్శించారు. ముఖ్యం గా, థర్మల్‌ కేంద్రాలను అనుమతించడం వల్ల కాలుష్యం పెరుగుతుందనే కారణంగా ఆనాటి పారిస్‌ సదస్సులో వాటికి వ్యతిరేకంగా సదస్సు తీర్మానం చేసింది. థర్మల్‌ కేంద్రాలు మూత పడితే దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని ట్రంప్‌ వాదించారు.

అంతేకాకుండా ఒబామా నిర్ణయాల వల్ల వాణిజ్య రంగంలో చైనా అమెరికాను దాటుకునిపోతోందని కూడా వ్యాఖ్యానిం చారు. అది కూడా అప్పట్లో పెద్ద వివాదాన్ని రేపింది. చైనాని నియంత్రించేందుకు ట్రంప్‌ ప్రయత్నించిన మాట నిజమే కానీ, ఇరాన్‌పై ఆంక్షలు విధించడమే కాకుండా, ఇరాన్‌తో వాణిజ్యం చేసే భారత్‌వంటి దేశాల పై కూడా ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఒబామా తీసుకుని వచ్చిన ఆరోగ్య పథకాన్ని రద్దు చేశారు. మొత్తం మీద ట్రంప్‌ అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు అన్నీ వివాదాలే. సౌదీ అరేబియాతో దౌత్యం విషయంలో కూడా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలు అమెరికా ప్రయోజ నాలను దెబ్బతీశాయి. ట్రంప్‌ వల్ల తాము నష్టపోయా మంటూ పెక్కు దేశాలు బహిరంగంగానే ప్రకటించాయి. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకునేట్టు భారత ప్రధాని నరేంద్రమోడీని ట్రంప్‌ ఒప్పించారు. దీంతో అలీన విధానం నుంచి భారత్‌ వైదొలగిందనే విమర్శలు భారత దేశంలో వచ్చాయి. ఇందుకు కారణమైన ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

కాగా, ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాల్లో అమెరికా దశాబ్దాలు గా అనుసరిస్తున్న విధానాలకు చేటు తెచ్చేవిగా ఉన్నాయ ని ఒబామా పలు సందర్భాల్లో విమర్శించారు. ఇప్పుడు ట్రంప్‌పై నమోదైన కేసులో అధికార రహస్యాల పత్రాల ను అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసే సమయంలో ఫ్లోరిడా లోని తన ఎస్టేట్‌కి తరలించినట్టు తెలుస్తోంది. అధ్యక్ష భవనంలో ఉండాల్సిన పత్రాలు బయట ఉంచడం నేరం గానే పరిగణించి ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ పత్రాలను తిరిగి తీసుకునేందుకు జాతీయ పురావస్తు రికార్డుల నిర్వహణా విభాగం ప్రయత్నించగా ట్రంప్‌ అడ్డుకున్నారన్న ఆరోపణ కూడా వచ్చింది. ఈ కేసులో ట్రంప్‌ ఎస్టేట్‌పై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బిఐ) అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని ఫైళ్ళను స్వాధీనం చేసుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈ కేసులో ట్రంప్‌ దోషిగా తేలితే ఆయన జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.

- Advertisement -

అయితే, త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తనకు అడ్డంకులు సృష్టించడా నికి డెమోక్రాటిక్‌ పార్టీ నాయకులు ఈ వ్యవహారాన్ని పైకి తెచ్చి అనవసరంగా ప్ర చారం చేస్తున్నారని ట్రంప్‌ అనుచ రులు ఆరోపించారు. ట్రంప్‌ హయాంలో ఉపాధ్యక్షుని గా పని చేసిన పెన్స్‌ ఈసారి రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్ధిగా తనను ఎంపిక చేయాలని కోరుతున్నారు. ఇందుకోసం ఆయన అప్పుడే ప్రచారాన్ని ప్రారంభించా రు. రాజ్యాంగం కన్నా తాము అధికులమని ఎవరైనా భావిస్తే వారి పతనం తప్పదని ఆయన తన మొదటి ప్రసంగంలోనే ట్రంప్‌పై పరోక్షంగా విమర్శలు కురిపిం చారు. పెన్స్‌ ప్రచారంతో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఇది కూడా ట్రంప్‌కి ప్రతికూల అంశమే. ట్రంప్‌ హయాంలో తీసుకు న్న నిర్ణయాలపై దర్యాప్తు జరిపించాలని డెమోక్రాట్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. అధ్యక్ష ఎన్నికలు సమీపించ డంతో ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement