త్రిపురను ఈశాన్య ప్రాంతాల ముఖ ద్వారంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల అభివర్ణించారు. ఐదేళ్లక్రితం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిపుర అభివృద్ధి చెందిందనీ, అంతకుముందు అభి వృద్ధికి నోచుకోలేదని ఆయన అన్న మాటల్లో అర్థ సత్యం ఉంది. త్రిపుర దశాబ్దాలుగా మార్క్సిస్టుల పాలనలో ఉం డటం వల్ల వెనకబడిందని చెప్పడమే. ఇందుకు కేంద్రం లోఎక్కువ కాలం అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లదే బాధ్యత.త్రిపురలో ఎక్కువ ఆదివాసీ తెగలు ఎక్కువ మంది ఉన్నారు.వారి అభ్యున్నతి కోసం నిధులు కేటాయించాల్సిన కేంద్రం ఆ తెగల మధ్య కల హాలను ఆసరగా చేసుకుని రాజకీయంగా పబ్బం గడుపు కోవడానికి ప్రయత్నించింది.గడిచిన ఐదు సంవత్స రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం అదే వైఖరిని అనుస రించింది. త్రిపుర అసెంబ్లిd ఎన్నికలు ఈనెల16వ తేదీన జరగ నున్నాయి.సీపీఎం కాంగ్రెస్‌తో జత కట్టగా,బీజేపీ ఐపిఎఫ్‌టితో కలిసి పోటీ చేస్తున్నది.గతఎన్నికల్లో ఐపిఎఫ్‌టితో కలిసే పోటీ చేసింది, కాంగ్రెస్ విడిగాపోటీ చేయడం వల్ల సీట్లు కోల్పోయింది. ఈసారి అందుకే సిపిఎంతో కలిసి పోటీ చేస్తోంది. సిపీఎం,కాంగ్రెస్‌ల మధ్య పొత్తు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వింతగా కనిపిస్తోంది. రాష్ట్రం లోఈ రెండు పార్టీలు ప్రత్యర్ధి పార్టీలుగా వ్యవహ రించాయి. దాని ప్రభావం ఓటర్లపై ఉండవచ్చు.అయితే, త్రిపుర లో గిరిజన తెగల మధ్య పూర్వపు ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ సఖ్యతను చేకూర్చ లేకపోయారన్న అభిప్రా యంతో ఆయనను గత సంవత్సరం మే నెలలో దింపేసి ప్రస్తుత ముఖ్యమంత్రి మాణిక్ సాహాను బీజేపీ నాయ కత్వం గద్దె నెక్కించింది.అయితే, విప్లవ్‌దేవ్‌కి ఎమ్మెల్యే ల్లో ఇప్పటికీ పట్టు ఉండటం వల్ల ఆయన సాహాను సక్ర మంగా పరిపాలన చేయనివ్వడం లేదన్న ఆరోపణలు వచ్చాయి.
వీరి మధ్య సఖ్యత చేకూర్చడానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా,కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ప్రయోజనం అంతంత మాత్రమే. అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ కూడా పలు సార్లు అగర్తలా వచ్చి బీజేపీలోని వైరి వర్గాల మధ్య సామరస్యం కోసం కృషి చేశారు.అయినా ఫలితం శూన్యం.టికెట్ల పంపిణీ విషయంలో కూడా బీజేపీలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.
ఈ నేపధ్యంలో ఈసారి తమదే విజయమన్న ధీమాతో మార్క్సిస్టు పార్టీ ఉంది. గతంలో కాంగ్రెస్ సాగించిన హత్యాకాండ కన్నా బీజేపీ ఎక్కువ నిర్బంధ కాండను కొనసాగించడం వల్ల తమ పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది మరణించారని సీపీఎం నాయకులు ఆరోపి స్తున్నారు.బీజేపీకి వ్యతిరేకంగా ఈసా రి మార్క్సిస్టు పార్టీ జత కట్టడానికి బహుశా కారణం అదే కావచ్చు. కాంగ్రెస్ పాత శత్రువే కనుక ఆ పార్టీ సంగతి తర్వాత చూసు కోవచ్చని సీపీ ఎం నాయకులు భావిం చినట్టుగా కనిపిస్తోంది.అంతేకాక,యూపీఏ తొలివిడత ప్రభుత్వానికి మార్క్సిస్టు పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కాగా,బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడం అంతసులభం కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.కిందటి సారి అధికారంలోకి రావడం కోసం బీజేపీ గిరిజన తెగల్లో వేర్పాటు వాదులకు మద్దతు ఇచ్చింది.ఇప్పుడు ఆ తెగలు ఏకు మేకై కూర్చున్నాయి.అది బీజేపీకి మింగుడు పడటం లేదు.ఆ తెగలనుసమన్వయ పర్చడంలో గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి విప్లవదేవ్ విఫలమయ్యారు.ఏడాది ముందు ఆయనను మార్చిన ప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ఈ నేపధ్యం లో బీజేపీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ,కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి ప్రచారాన్ని జరిపిం చింది.
ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగిం చడం బయటివారి వల్ల కాదనే విషయాన్ని బీజేపీ కేంద్ర నాయ కత్వం ఎట్టకేలకు గ్రహించింది.అయితే, కాంగ్రెస్‌తో సీపీఎం జత కట్టడం వల్ల మార్క్సిస్టు పార్టీ కేడర్‌లో అసంతృప్తి ఉంది.దశాబ్దాలుగా నిప్పు-ఉప్పుగా వ్యవహరించిన ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఇప్పుడు కలిసి పనిచేయడంలో సమస్యలను ఎదుర్కొం టున్నారు. జాతీయ స్థాయిలో సర్దుబాట్లు,పొత్తులు వేరు, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు కలిసి పని చేయడం వేరు అని అంటున్నారు. కాంగ్రెస్‌కి గతంలో సంతోష్ మోహన్ దేవ్ వంటి సీనియర్ నాయకుల మార్గ దర్శకత్వం ఉండేది.మార్క్సిస్టు పార్టీ సుదీర్ఘ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు.మధ్యలో తృణమూల్ కాంగ్రెస్ రావడం వల్ల ఆ పార్టీలోకి కొందరు చేరిపో యారు.ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా సిపిఎంకి కలిసొచ్చేదేమీ లేదని అంటు న్నారు. మార్క్సి స్టు పార్టీ సొంత బలంపైనే అధికారం లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఏమైనా ఈసారి బీజేపీని అధికారంలోకి రానివ్వరాదన్న దృఢనిశ్చయం తోఈ రెండు పార్టీలు పని చేస్తున్నాయి.