Wednesday, November 20, 2024

Editorial – కాంగ్రెస్ లో రాహుల్ జోష్ …

కొద్దిరోజులుగా కాంగ్రెస్‌లో ఉత్తేజంతో కూడిన మార్పు కనిపిస్తోంది. కర్నాటక ఫలితాలు మొదలు ఒక్కసారిగా ఆ పార్టీలో మార్పు వచ్చింది. సమస్యలు, వివాదాలపై చురుకుగా స్పందించడం, ఎత్తులు పైఎత్తు లు వేయడం, వ్యూహాలు పన్నడం.. అవసరాన్నిబట్టి ఆ వ్యూహాలను మార్చడం వంటి జిత్తులతో చాణక్యం ప్రద ర్శిస్తోంది. మొత్తం మీద ఆ పార్టీ స్తబ్దత నుంచి బయట పడింది. విపక్ష కూటమి ‘ఇండియా’ ఏర్పాటు నేపథ్యం లో ఆప్‌తో సయోధ్య నెరపుతూ ఢిల్లిd ఆర్డినెన్స్‌ బిల్లుకు మద్దతు ఇవ్వడం నుంచి ప్రస్తుతం పార్లమెంట్‌లో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసంపై చర్చ వరకు కాంగ్రెస్‌ ఈ ధోరణి ప్రదర్శించింది. కాంగ్రెస్‌ సమరోత్సాహం అటు నేతల్లోను, శ్రేణుల్లోను ఉత్సాహాన్నిస్తోంది. మరోవైపు భారత్‌ జోడో యాత్ర తరువాత రాహుల్‌గాంధీలో వచ్చి న మార్పు, వివిధ అంశాలపై ఆయన మాటలు, చేతల్లో వచ్చిన విశాలదృక్పథం పెద్దతరహాను ప్రస్ఫుటిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వ పునరు ద్ధరణ, మంగళవారం సభలో ప్రవేశించడంతో కాంగ్రెస్‌ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. నరేంద్రమోడీ ప్రభుత్వంపై అవిశ్వాసంపై చర్చలో పాల్గొని తొలిరోజే నిప్పులు కురిపిస్తారేమోనని అంతా అనుకున్నారు. మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆయన ప్రారంభిం చే అవకాశం ఉందని అనుకున్నారు.

ఈ మేరకు పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు కూడా. కానీ, రాహుల్‌ మొదటి వరసలోనే మౌనంగా కూర్చున్నారు. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌ మార్చిన వ్యూహంలో భాగంగానే ఆయన నోరు మెదపకపోయి ఉండవచ్చు. చర్చనీయాం శం మణిపూర్‌ కనుక, ఈశాన్య రాష్ట్రానికి చెందిన సభ్యుడై న గౌరవ్‌ గొగోయ్‌కి ఆ అవకాశం లభించింది. ఇది కాంగ్రె స్‌ వ్యూహంలో భాగంకూడా కావొచ్చు. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణ జరగడంతో ఆయన ఇంతకు ముందు ఖాళీ చేసిన బంగళానే లోక్‌సభ కమిటీ కేటా యించింది. అంతకుముందు ఈ విషయమై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘దేశమంతా నా ఇల్లే’ అని క్లుప్తంగా సమాధానమిచ్చారు. ఆయన సమాధానంలో అంతరార్థం అటుంచితే, అది ముమ్మా టికీ యధార్థం. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబ వారసునిగా ఆయన ఆ సమాధానమిచ్చి ఉండవచ్చు. మణిపూర్‌ గురించి బయట రాహుల్‌ ఇప్పటికే మాట్లాడా రు. సభలో ఇతరుల అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వా లని ఆయన చొరవ తీసుకుని ఉండకపోవచ్చు.

అంతేకాక, బీజేపీ పెద్ద నాయకులు మాట్లాడిన తర్వాత వారు చెప్పే సమాధానాన్ని బట్టి జవాబు ఇవ్వాలని అనుకుని ఉండ వచ్చు. మొత్తం మీద రాహుల్‌ వైఖరిలో ఆచితూచి చూసే విధానం కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానంపై పార్టీల సభ్యులకు వారి సంఖ్యాబలాన్ని బట్టి సమయాన్ని స్పీకర్‌ కేటాయించారు. బీజేపీకి ఆరున్నర గంటలు, కాంగ్రెస్‌కి గంటన్నర, టీఎంసీ, డీఎంకేలకు చెరి 30 నిమిషాలు, ఇతర పార్టీలకు వాటి సంఖ్యా బలాన్ని బట్టి కేటాయిచా రు. మణిపూర్‌పై మాట్లాడేందుకు సభలో అవకాశం దొరకనందునే, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ సభ్యుడు ఒకరు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌ అరెస్టుకు సూరత్‌ కోర్టు ఆదేశాలు జారీ చేయడం, దానిపై ఆయన గుజరాత్‌ హైకోర్టులో అప్పీలు చేయడం, దానిని హైకోర్టు కొట్టి వేయడం, తిరిగి సుప్రీంకోర్టు నుంచి స్టే పొందడం తెలిసిందే. ఈ పరిణామాలు రాహుల్‌లో కొంత మార్పు తెచ్చి ఉంటాయి. లోక్‌సభకు దూరంగా ఉన్నా ఆయన ముఖ్యమైన అంశాలపై మాట్లాడుతూనే ఉన్నారు.

తన అరెస్టుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం పట్లహర్షం వ్యక్తం చేస్తూ, ద్వేషంపై ప్రేమ విజయం సాధించిందని వ్యాఖ్యా నించారు. తన దారి తనదేనంటూ కూడా ఆయన ప్రభుత్వంపై దాడి విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాన్ని ఇచ్చారు. ఇలాంటి ఒత్తిడులు, వేధింపులకు బెదరబోనన్న స్పష్టీకరణ కూడా అందులో ఉంది. లోక్‌సభలో లేని సమయాన్ని ఆయన ప్రతిపక్షాల ఐక్యత కోసం కూడా వినియోగించుకున్నారు. ఆయన కృషి ఫలించి అధికార కూటమి ఎన్‌డీఏకి దీటుగా ‘ఇండియా’ అనే కూటమి ఏర్పడింది. ప్రతిపక్ష కూటమికి ఆ పేరును సూచించింది రాహులే. ఈ కూటమి సమావేశాలు ఒక్కొ క్కసారి ఒక్కక్క రాష్ట్రంలో జరిగాయి. తదుపరి సమావే శం ముంబాయిలో ఏర్పాటు చేస్తున్నట్టు శివసేన అధ్యక్షు డు ఉద్ధవ్‌ థాకరే ప్రకటించారు. ఎన్సీపీలో చీలిక వల్ల అక్కడ ప్రతిపక్షాల నుంచి మరింతమంది జారిపోకుం డా పటిష్ట పర్చాల్సిన అవసరం ఉన్నందున తదుపరి సమాశానికి వేదిక ముంబాయిగా నిర్ణయించి ఉండవ చ్చు. ప్రతిపక్షాలను సమైక్య పర్చడానికి రాహుల్‌ చిత్తశుద్ధి తో కృషి చేస్తున్నారు. ఇప్పుడు లోక్‌సభ అనర్హత వేటు తప్పినందున మరింత ఉత్సాహంతో ఆ ప్రయత్నాలను ముమ్మరం చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement