Friday, November 1, 2024

ఎడిటోరియ‌ల్ – ఆస్కార్ అవార్డుల పంట‌..

తెలుగు చలనచిత్రాన్ని విశ్వయవనికపై నిలబె ట్టిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి యావత్‌ తెలుగు జాతి జేజేలు పలుకుతోంది. అహో రాజమౌళి అంటూ ప్రశంస లు కురిపిస్తోంది. ఇంతటి మహత్తర అవకాశం కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ అవార్డుల పంట రావడం ముమ్మాటికీ పండుగే. ఆర్‌ఆర్‌ ఆర్‌ చిత్రం ఆస్కార్‌ గెల్చుకుంటుందని ముందు నుంచి అనుకుంటున్నా, ఈ చిత్రందర్శకుడు రాజమౌళి, సంగీ త దర్శకుడు ఎంఎం.కీరవాణి,పాటల రచయిత చంద్ర బోస్‌లకు నేపధ్య గీతాలను అందించిన కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌లకు అవార్డులు రావడం తెలుగు వారికి మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా ఉంది. చంద్రబోస్‌ తెలంగాణమట్టి వాసనలను ఆ గీతంలో చూపారు. ఆస్కార్‌ అవార్డుల్లో భారత్‌ ప్రస్తానం 1983 నుంచి కొనసాగుతూనే ఉంది.గాంధీ చిత్రం కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా భాను అతయ ఎన్నికయ్యారు. 1992లో సత్యజిత్‌ రేకి లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. 2009లో స్లమ్‌ డాగ్‌ మిలియనీర్స్‌ చిత్రంలో గీత రచయ త గుల్జార్‌కి,ఉత్తమ ఒరిజనల్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌గా ఎఆర్‌ రెహమాన్‌,2009లో బెస్ట్‌ సౌండ్‌ ఇంజనీర్‌గా రసూర్‌ పూకుట్టికి అవార్డు లభించింది.ఈ అవార్డులను నటీనటు లకు, టెక్నీషన్స్‌కు,ఇతర ప్రముఖులకు అందజేస్తున్నా రు. ఈ అవార్డు కింద ఈ ఏడాది అవార్డు సొమ్మును ప్రస్తుతం ప్రకటించ నప్పటికీ, గిఫ్ట్‌ ప్యాక్‌ల రూపంలో అందిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా సినిమారంగంలో కళాత్మకంగా, సాంకేతికంగా ప్రతిభను ప్రదర్శించే చిత్రాలకు ఈ అవార్డులను 1929 నుంచి ఇస్తున్నారు.ఈ అవార్డును అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్‌ అండ్‌ సైన్సెస్‌ నెలకొల్పింది. మొదటిసారిగా అవార్డుల ప్రదానో త్సవం 1929లో జరిగింది.ఆస్కార్‌ అవార్డులకు చిత్రా లు ఎంపిక కావడమే గొప్ప విషయం. అక్కడ అవార్డు లను పొందడం ఇంకా ఘనమైన విషయం. భారత చలన చిత్ర రంగంలో ఎన్నోచిత్రాలు ఆస్కార్‌ అవార్డుకు అర్హమై నవి ఉన్నప్పటికీ అవార్డులకు అవి నోచుకోలేదు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ ఆర్‌ చిత్ర త్రయానికి అవార్డులు లభించడం పట్ల ప్రధాని నరేంద్రమోడీ నుంచి, సామాన్య నిర్మాతలు, దర్శకుల వరకూ, నటీనటుల వరకూ అంతా తమ ఇంట్లో పండుగ జరిగినంత ఆనందాన్ని పొందుతున్నా రు. ముఖ్యంగా ఈ ఏడాది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో చంద్ర బోస్‌ రాసిన నాటునాటు పాట అందరి నోటంటా వినిపి స్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ , రామ్‌చరణ్‌లు ఈ పాటకు వేసిన స్టెప్‌లను అనుకరించేందుకు యవతరం పోటీ పడుతోందంటే అతిశయోక్తి కాదు. మహిళలు, ముఖ్యం గా సెలెబ్రిటీలు సైతం ఈ పాటకు స్టెప్‌లు వేయడం ఆశ్చ ర్యకరమే.ఈ పాట వస్తోందన గానే తమ హోదానూ, సందర్భాన్ని విస్మరించి స్టెప్‌లు వేయడం ఎలక్ట్రానిక్‌ సాధనాల్లో చూస్తున్నాం.. ఇటీవలకాలంలో ఇంతగా ఆదరణ పొందిన పాట ఇదేనేమోననిపిస్తోంది.

డాక్యు మెంటరీ షార్ట్‌ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి అవార్డుల పంటపై చలన చిత్ర రంగ ప్రముఖులు, రాజకీ య నాయకుల స్పందనలు ఎంతో హర్షదాయకంగా ఉన్నాయి. ఆస్కార్‌ విజయం భారతీయులందరిలో ఆత్మీయ భావాన్ని పెంచింది.భారతీయులంతా తమకు అవార్డు వచ్చినట్టే సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా తెలుగువారి ఆనందానికి అవధులు లేవు. దర్శకుడు రాజమౌళి ధైర్యానికీ, విజన్‌కీ ఈ చిత్రం అద్దం పడుతోం దని పలువురు ప్రశంసిస్తున్నారు. బాహుబలి చిత్రంతో అంద రి ప్రశంసలు అందుకున్న రాజమౌళిఈ చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు.తనతోపాటు ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్న వారందరికీ కీర్తిని ఆర్జిం చి పెట్టారు. ఈ చిత్రానికి లభించిన ఖ్యాతి తెలుగువారిని ఉబ్బితబ్బిబ్బు అయ్యేట్టు చేస్తోంది. తెలుగు సినిమాకు అజరామరమైన కీర్జిని ఆర్జించి పెట్టిన చిత్ర బృందానికి యావత్‌ తెలుగు జాతి కైమోడ్పులందిస్తోంది. కాగా, తెలుగుసినిమా ఆస్కార్‌ స్థాయికి వెళ్ళింది ఇదే మొదటి సారి.ఆస్కార్‌ దేశానికి సాధించిన మొదటి ఫీచర్‌ చిత్రం. నాటు, నాటు పాట రాసిన చంద్రబోస్‌,గాయకులు రాహు ల్‌ సిప్లిగంజ్‌ కాలభైరవలు చలనచిత్ర చరిత్రలో గుర్తుండి పోతారు. బాహుబలి చిత్రంతో యావత్‌ ప్రపంచం భారతీయ సినిమా వైపు ఎదురు చూస్తోంది.ఆ చిత్రాన్నీ, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్నీ నిర్మించింది రాజమౌళి యే కావడం గమనార్హం. రాజమౌళి కృషి, పట్టుదల అద్వితీయం, ఆస్కార్‌ సాధించాలన్న ఆయన ఆశయం నెరవేరింది. అలాగే, కీరవాణి అందించే సంగీతం భారతీ య ఆత్మకు ప్రతిరూపంగా నిలుస్తుంది. అన్నమయ చిత్రంలో అన్ని గీతాలకూ భక్తిభావాన్ని వ్యాపింపచేసే రీతిలో ఆయన సంగీతాన్ని అందించారు. ఇదే పట్టుదల తో ఈ బృందం మరిన్ని అవార్డులు అందు కోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement