సభలో మాట్లాడాల్సిన అంశాలు బయటా, బయట మాట్లాడాల్సిన విషయాలు సభలో మాట్లాడటం ప్రజా స్వామ్యానికి ఏమాత్రం గౌరవప్రదం కాదు. కానీ, దుర దృష్టవశాత్తు మన పార్లమెంటులో,వివిధ రాష్ట్రాల శాసనసభల్లో పరిస్థితి అలాగే ఉంది.ఇందుకు రాజకీయ పార్టీలదే బాధ్యత అని అంటే ఎంత మాత్రం అసత్యం కాదు. కళ్ళెదుట కనిపిస్తున్న సత్యం.పార్లమెంటు సమా వేశాలు ప్రారంభమైన తర్వాత తాము మాట్లాడేందుకు వీలు లేకుండా అధికారపక్ష సభ్యులు అదే పనిగా అడ్డు పడ్డారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించగా,సభా నిబంధన లను గాలికి వదిలేసి ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుని పడటం వల్లనే సభలు వాయిదా పడుతు న్నాయని అధికార పక్ష సభ్యులు వాదిస్తున్నారు. విత్తు ముందా? చెట్టు ముందా అన్న సంశయం ప్రకారం ఆలోచిస్తే రెండూ వాస్తవమేననిపిస్తోంది. ప్రధానమం త్రి నరేంద్రమోడీ సభలో వివరణ ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదన్నది రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న హిండెన్‌బర్గ్ నివేదికను ప్రతిపక్షాలు సభలో ప్రస్తావించ కూడదంటే మరి ఎక్కడ ప్రస్తావించాలి.ఈ నివేదికపై ప్రభుత్వం అధికారికమైన వివరణ ఇస్తే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదు.కానీ, ఇరు పక్షాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది. నిజానికి ఇది ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఇంకా చెప్పాలంటే దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం. దీనిపై ప్రభుత్వం కిమ్మన్నాస్తిగా ఊరుకుంటే, ఎవరికితో చింది వారు ఎక్కడపడితే అక్కడ మాట్లాడతారు.
దాన్నిఎవరైనాఎలా తప్పు పడతారు. రాహుల్ గాంధీ మన అంతర్గత విషయాలను లండన్‌లో ప్రస్తావించి మహాపరాథం చేశారని అధికారపక్షం ఆరోపిస్తున్నది. హిండెన్‌బర్గ్ అమెరికాకి చెందిన సంస్థ. ఆ సంస్థ తన నివేదికలో మనదేశానికి చెందిన కార్పొరేట్ దిగ్గజమైన గౌతమ్‌అదానీ జాతీయ వాదం ముసుగులో స్టాక్ మార్కెట్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడినట్టు బహిరంగంగానే ఆరోపించింది. ఈ ఆరోపణను అదానీ కానీ, ప్రభుత్వం కానీ నేరుగా ఖండించలేదు. దీనిపై పార్లమెంటులో చర్చించాలని రాహుల్ గాంధీ పట్టుబడి తే ఆయనకు అవకాశం ఇవ్వలేదు. పార్లమెంటు తొలివిడ త బడ్జెట్ సమావేశాల్లో ఎంత ప్రయత్నించినా తనకు అవకాశం రాకపోవడంతో లండన్ పర్యటన సందర్భం గా ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
పార్లమెంటు ఉభయ సభల అధిపతులు ఈ అంశంపై గొడవను సర్దు మణిగేట్టు చేయడానికి ప్రయత్నించకుండా, పదే పదే సభలను వాయిదాలు వేయడంతో ప్రతిపక్షాలు మరింత రెచ్చిపోయాయి. ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పంద న లేకపోవడంతో రాహుల్ గాంధీ అదానీకీ, ప్రధాని నరేంద్రమోడీకీ మైత్రి కారణంగా మాట్లాడలేక పోతు న్నారంటూ ఆరోపించారు.రాహుల్ ఆరోపణను ఖండి స్తూనైనా ప్రధాని సమాధానమిచ్చి ఉండాల్సింది. తమ పార్టీ ఎంపీలనే బరిలోకి విడిచి పెట్టడం వల్ల కాంగ్రెస్ వాదులు అవమానంగా భావిస్తూ వచ్చారు. ప్రధానమం త్రి సభా నాయకునిగా సభలో స్పష్టమైన ప్రకటన చేయడం ప్రతిపక్షానికి ఎంత గౌరవమో, ప్రజలకు అంత జవాబుదారీ అవుతుంది. ఈ విషయాన్ని మోడీ పాటిం చడం లేదన్న అభిప్రాయం అందరిలో ఉంది. ఈ ఒక్క విషయంలోనే కాకుండా ఆయన ఇంతవరకూ ప్రతిపక్షా న్ని ఖాతరు చేయడం లేదన్న అభిప్రాయమూ ఉంది.
ప్రతిపక్షం సంఖ్యాబలాన్ని బట్టి కాకుండా, సంబంధిత అంశాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని స్పందించడం ప్రధాని బాధ్యత.ప్రతిపక్షాలకు కాకుండా తాను ప్రజలకు జవాబుదారీ అన్న విషయాన్ని ఆయన నిరంతరందృష్టి లో ఉంచుకోవాలి. అదానీ వ్యవహారంపై ప్రశ్నిస్తే, ఐటి, ఈడీదాడుల వల్ల ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయని మోడీ అనడంఏపాటి న్యాయమో ఆయనే చెప్పాలి. రాహుల్ గాంధీ,ఆయన పార్టీ సభ్యుల సంగతి అలా ఉంచి, అదానీ వ్యవహారంలో ఏంజరిగిం దో, హిండెన్‌బర్గ్ అంత తీవ్రమైన ఆరోపణ ఎందుకు చేసిందో తెలుసుకోవాలన్న ఆత్రుత ప్రజల్లో ఉంది. మనదేశానికి చెందిన ఒక కార్పొరేట్ అధిపతిపై ఒక విదేశీ సంస్థ ఇంత తీవ్రంగా అభిశంసించే ధోరణిలో వ్యాఖ్యలు చేయడం ఇదే ప్రథమం. పైగా, జాతీయవాదం ముసుగు లో అక్రమాలు చేస్తున్నారంటూ ఆ సంస్థ ఆరోపించడం ముమ్మాటికీ అభిశంసించడమే. ఇంత తీవ్రమైన విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం ప్రభుత్వానికి న్యాయం కాదు. ఇది కేవలం ప్రభుత్వమూ,ప్రతిపక్షాలకు సంబం ధించిన అంశం కాదు. దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం. దీనిపైఇప్పటికైనా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ముఖ్యంగా, ప్రధానమంత్రిపై ఉంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి వ్యక్తిగతంగా తీసుకోకూడ దు. ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.